Advertisementt

బాలయ్య-బోయపాటి.. ఎవరికి ఎవరితో ఇబ్బంది!?

Wed 25th Dec 2019 06:52 PM
balayya vs boyapati,balakrishna,boyapati srinu,boyapati film  బాలయ్య-బోయపాటి.. ఎవరికి ఎవరితో ఇబ్బంది!?
Why Balayya Vs Boyapati.. What Happend! బాలయ్య-బోయపాటి.. ఎవరికి ఎవరితో ఇబ్బంది!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష తాజా చిత్రం ‘రూలర్’ దెబ్బకి బయ్యర్లు బెంబేలెత్తుతున్నారు. మొదటి రోజు పర్వాలేదనిపించినా ‘రూలర్’ రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం, మూడో రోజు అదే విధంగా కలెక్షన్స్ డ్రాపవడంతో.. ‘రూలర్’ కొన్న బయ్యర్లు భయపడిపోతున్నారు. ‘కథానాయకుడు’,  ‘మహానాయకుడు’ కన్నా ‘రూలర్’ సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉండటంతో.. బయ్యర్లంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. నిర్మాత సి. కళ్యాణ్ సినిమాని ప్రాఫిట్‌తో అమ్మేశాడు కానీ... లేదంటే ‘రూలర్’ దెబ్బకి మరో సినిమా నిర్మించాలంటే భయపడేవాడు. అంత దారుణంగా వుంది రూలర్ పరిస్థితి. అయితే ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల కన్నా ‘రూలర్’ తో బాలయ్య ఇమేజ్ సొంతం పడిపోయింది. గతంలో ఇలా క్రేజ్ లేని బాలకృష్ణని బోయపాటి ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలతో పైకి లేపాడు. ఆ సినిమాల్తో బాలకృష్ణ క్రేజ్ భారీగా పెరిగింది.

అయితే... తాజగా బాలయ్య ఉన్న పరిస్థితిలో బోయపాటితో సినిమా అంటే ఆటోమాటిక్‌గా క్రేజ్ వచ్చేస్తుంది. మళ్ళీ బోయపాటి నాలుగు పవర్ ఫుల్ డైలాగ్స్, నాలుగు కసకసలాడే యాక్షన్ సీన్స్ పెట్టాడంటే.. బాలయ్య క్రేజ్ ఆటోమాటిక్‌గా సెట్ అవుతుంది. అయితే అటు బోయపాటి కూడా యాక్షన్‌ని నమ్ముకుని ‘వినయ విధేయరామ..’తో ఘోరంగా దెబ్బతిన్నాడు. రామ్ చరణ్‌తో కత్తిపట్టించి మరీ బోయపాటి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. మరి ‘రూలర్’ దెబ్బకి ఇప్పుడు బాలకృష్ణతో సినిమా అంటే అటు బోయపాటికి ఇబ్బందా.. ఇటు వినయ విధేయరామ ట్రాక్ రికార్డ్‌తో ఉన్న బోయపాటితో సినిమా అంటే బాలయ్య సాహసం చేసినట్లే అవుతుంది..!

Why Balayya Vs Boyapati.. What Happend!:

Why Balayya Vs Boyapati.. What Happend!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ