Advertisementt

2020 మాదే అంటున్న హీరోయిన్స్!!

Wed 25th Dec 2019 05:44 PM
2020,tollywood,top heroines,pooja hegde,rashmika mandanna  2020 మాదే అంటున్న హీరోయిన్స్!!
2020 Is Ours Says Tollywood Top Heroines!! 2020 మాదే అంటున్న హీరోయిన్స్!!
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్‌లో ఇద్దరే ఇద్దరు హీరోయిన్స్.. స్టార్ హీరోలతోనూ, యంగ్ హీరోలతోనూ బిజీగా ఉన్నారు. స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాల్తో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్న పూజ హెగ్డే, రష్మిక మందన్నా ఇద్దరూ 2020 మాదే అంటున్నారు. ఎందుకంటే 2020లో వీరిద్దరి సినిమాల జోరు ఆలా ఉంది మరి. పూజ జనవరిలో ‘అల వైకుంఠపురంలో..’ సినిమాతో అల్లు అర్జున్‌తో కలిసి బోణి చెయ్యబోతుంటే.. రష్మిక అయితే మహేష్‌తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు..’ అంటూ రాబోతుంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో నితిన్ భీష్మతో రష్మిక మరోసారి ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు..’ సినిమా షూటింగ్ పూర్తి చేసి నితిన్‌తో కలిసి ‘భీష్మ’ సినిమా కోసం రోమ్‌కు చెక్కేసింది.

ఇక పూజ అయితే ‘అల వైకుంఠపురంలో..’ తర్వాత అఖిల్‌తో కలిసి బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేస్తుంది. ఆ సినిమా 2020 రిలీజ్. ఇక ప్రభాస్‌తో చేస్తున్న ‘జాన్’ సినిమా వివరాలేమీ బయటికి రావడం లేదుకానీ.. మోస్ట్లీ ప్రభాస్ ‘జాన్’ కూడా 2020 రిలీజ్ ఉండొచ్చు. ఇక రష్మిక, అల్లు అర్జున్-సుకుమార్ కాంబో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్. మరో సినిమా కూడా 2020లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మరి 2020లో పూజ హెగ్డే, రష్మికల హడావిడి మాములుగా లేదండోయ్. ఇక వీరి సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా.. ఇక వీరిని ఆప తరమా..!

2020 Is Ours Says Tollywood Top Heroines!!:

2020 Is Ours Says Tollywood Top Heroines!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ