Advertisementt

నిర్మాత దిల్‌రాజు మౌనం అందుకేనా!?

Tue 24th Dec 2019 05:57 PM
tollywood,dil raju,producer dilraju,96 movie,pink remake  నిర్మాత దిల్‌రాజు మౌనం అందుకేనా!?
Why Dil Raju Silent..! నిర్మాత దిల్‌రాజు మౌనం అందుకేనా!?
Advertisement
Ads by CJ

సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో నిర్మించిన ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమా ప్రమోషన్స్‌తో యమా బిజీగా వున్నాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ పింక్ నిర్మాణ పనులతోనూ ఊపిరి సలపడం లేదు. అయితే దిల్ రాజు ఏరికోరి రీమేక్ రైట్స్ కొనుకున్న ‘96’ సినిమా ముచ్చట్లేమీ చెప్పడం లేదు. తమిళ 96 హక్కులను కొని తెలుగులో సమంత - శర్వానంద్‌తో సినిమాని నిర్మించాడు దిల్ రాజు. మరి ‘96’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సమంత వెబ్ సీరీస్ కోసం ఢిల్లీ చెక్కేసింది. మరోపక్క శర్వా కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కానీ, సినిమా టైటిల్‌ని కానీ దిల్‌రాజు ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే ఈ సినిమాకి సమంత పేరు జానకి అనో లేదంటే జాను అనో పెడదామని యూనిట్ ఫిక్స్ అయ్యింది.

కానీ ప్రభాస్-రాధాకృష్ణ వర్కింగ్ టైటిల్ ‘జానూ’గా ప్రచారంలో ఉంది. ఫైనల్‌గా ప్రభాస్ సినిమా పేరు ‘జాన్’ అనే ఫిక్స్ అయ్యేలా ఉందనేది మరో వాదన. అయితే దిల్‌రాజు ‘జాను’ టైటిల్‌పై పట్టుకోసం ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌తో చర్చలు జరుపుతున్నాడట. అయితే వారు అదిగో ఇదిగో అంటూ నాన్చుతూ దిల్ రాజుకి మాటివ్వడం లేదట. అయితే యూవీ క్రియేషన్స్ వారు తనకి ‘జానూ’ టైటిల్ ఇస్తే... గనుక సినిమా టైటిల్‌తో పటు రిలీజ్ డేట్ ప్రకటించే యోచన చేసిన దిల్ రాజుకి.. యువీ నుండి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయని... అందుకే తొందర పడకుండా ప్రస్తుతం ‘96’ రీమేక్‌పై దిల్‌రాజు మౌనం వహిస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్.

Why Dil Raju Silent..!:

Why Dil Raju Silent..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ