ఈ శుక్రవారం రెండు తెలుగు స్ట్రయిట్ సినిమాలు, ఒక తమిళ్ సినిమా, మరొక బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ నాలుగు సినిమాల్లో తెలుగు నుండి ప్రతిరోజూ పండగే సినిమా, రూలర్ విడుదల కాగా, తమిళం నుండి ఖైదీ కార్తీ దొంగ సినిమాతోనూ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ను బాక్సాఫీసు వద్ద పోటీకి దిగారు. అయితే సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాకి హిట్ టాక్, రూలర్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా... కార్తీ దొంగ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సల్మాన్ దబాంగ్ 3 ని ఎవరు పట్టించుకున్నట్టుగా లేదు.
ఇక ఈ నాలుగు సినిమాలు మొదటి రోజు వసూళ్లలో సాయి తేజ్ బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకోగా రెండో రోజు ఫ్యామిలీ ఆడియన్స్ తో పండగ థియేటర్స్ కళకళలాడాయి. ఇక రూలర్ సినిమాకి అనూహ్యంగా అభిమానులే షాకిచ్చారు. బాలయ్య నుండి పవర్ ఫుల్ ఎంటెర్టైనర్ వస్తుంది అనుకుంటే రొటీన్ సినిమా వచ్చిందిరా అంటూ.. అభిమానులే షాకవుతున్నారు. ఇక కార్తీ దొంగ సినిమాకి హిట్ టాక్ పడింది. కానీ సినిమాకి అనుకున్నంత ప్రమోషన్స్ లేవు. ఖైదీతో ఇరగదీసిన కార్తీ దొంగకి పక్కా ప్రమోషన్స్ చేసినట్టయితే.. దొంగ ముందు పండగ సినిమా కూడా పడుకోవాల్సి వచ్చేది. ఇక దబాంగ్ 3 అనుకున్నంతగా లేకపోవడం, మూడు సినిమాలతో పోటీ పడడంతో... సల్మాన్ తెలుగులో తన పవర్ చూపించలేకపోయారు. ఇక రూలర్, దొంగ, దబాంగ్ 3 లు రెండో రోజు వీకవడంతో.. ప్రతిరోజు పండగ పుంజుకుని.. సినిమాని హిట్ దిశగా నడిపిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఫైనల్ గా ఈ వారం బాక్సాఫీసు విన్నర్ పండగ సినిమానే.