పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఫిక్స్ అవడము, పింక్ రీమేక్ అధికారికంగా సెట్స్ మీదకెళ్ళడం జరిగిపోయింది. దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కొన్నేళ్ల కల ఈ విధంగా తీరనుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ ఇంకా పాల్గొంటున్నాడో లేదో కానీ.. ఈ సినిమా ముచ్చట్లు మాత్రం సోషల్ మీడియాలో నిండిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అత్యధిక పారితోషకానికి ఈ మూవీ చేస్తున్నాడని, దిల్ రాజు కూడా పవన్ క్రేజ్‌ని నమ్ముకుని పవన్ కి గట్టిగా ఇస్తున్నాడని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ హీరోయిన్స్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయ్యారు.
అంజలి, నివేత థామస్‌తో పాటుగా మల్లేశం హీరోయిన్ అనన్యను పింక్ రీమేక్ కోసం ఫైనల్ చేశారని టాక్. ముందు నుండి పవన్ కళ్యాణ్ సినిమాలో పూజా హెగ్డే అని, కాదు.. సమంత కీలకమైన హీరోయిన్ పాత్రకి అని అన్నారు. ఇక సమంత కాదు. ఒరిజినల్ పింక్ లో నటించిన తాప్సి మెయిన్ లీడ్ అన్నారు. తాజాగా అంజలి, నివేత థామస్, అనన్యను ఫైనల్ చేశారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రేంజ్‌కి ఈ హీరోయిన్స్ ఆనతారా అంటూ పవన్ ఫ్యాన్స్ కాస్త వర్రీ అవుతున్నారు.
అయితే పింక్ సినిమాలో హీరోయిజం ఎలివేషన్ ఉండదు. అలాగే హీరోయిన్స్ కూడా గ్లామర్‌గా నటించాల్సిన అవసరం లేదు. కాబట్టే కాస్త ఫేమ్ ఉన్న ఈ హీరోయిన్స్ ని తీసుకున్నారని సమాచారం. ముందు పవన్ ఫ్యాన్స్ పింక్ రీమేక్ విషయం తెలియగానే భయపడినా.. వేణు శ్రీరామ్, పవన్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ రాసుకున్నాడని తెలిసి కూల్ అయ్యారు. తాజాగా హీరోయిన్స్ విషయంలోనూ పవన్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారని అంటున్నారు.