డిస్కోరాజా చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఢిల్లీవాలాకు అమేజింగ్ రెస్పాన్ !!!
వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఢిల్లీవాలా..’ అనే గీతాన్ని శుక్రవారం (డిసెంబర్ 20) విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియర్ పాడడం జరిగింది. హీరో పరిచయ గీతంగా విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 1.5 మిలియన్ల ప్లస్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ అవుతోంది. తమన్ తనదైన శైలిలో మెలోడీ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్ ఘట్టమనేని, సంభాషణలు అబ్బూరి రవి.