Advertisementt

అందుకే రాశీ ఖన్నా డుమ్మా కొట్టిందా?

Sat 21st Dec 2019 10:00 PM
raashi khanna,prathiroju pandage,venky mama,promotions,guntur  అందుకే రాశీ ఖన్నా డుమ్మా కొట్టిందా?
Raashi Khanna Missed Venky Mama Success Celebrations అందుకే రాశీ ఖన్నా డుమ్మా కొట్టిందా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రాశి ఖన్నా టైం నడుస్తుంది. ఒకే నెలలో రెండు సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా వెంకీమామతో పాటు.. నిన్న విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టినట్లే కనబడుతుంది. వెంకీమామకి యావరేజ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్స్ బాగున్నాయి. ఇక ప్రతిరోజూ పండగే సినిమాకి హిట్ రివ్యూస్, ప్రేక్షకుల హిట్ టాక్‌తో సినిమా థియేటర్‌లో దూసుకుపోతుంది. అయితే వెంకీమామ ప్రమోషన్స్‌తోనూ, ప్రతిరోజూ పండగే ప్రమోషన్స్‌తో ఊపిరి సలపకపోయినా రాశి ఖన్నా రెండింటిని బాగానే బ్యాలెన్స్ చేసి.. రెండు సినిమాల యూనిట్స్‌తో సందడి చేసింది.

నిన్న విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమాకి హిట్ టాక్ రావడమే కాదు.. రాశి ఖన్నా క్యారెక్టర్‌కి మంచి మార్కులు  పడ్డాయి. ఈ సినిమాలో రాశిఖన్నా తొలిప్రేమ తర్వాత బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అమాయకత్వం..చలాకీతనం.. కాస్త చిలిపితనం.. అన్నీ కలబోసిన పాత్ర ఏంజెల్‌ ఆర్నాగా ఇంప్రెస్‌ చేసింది. మరి ఈ సినిమాలో రాశి ఖన్నా చాలా బాగుందని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే తాజాగా ప్రతిరోజూ పండగే విడుదలైన రోజునే రాశి ఖన్నా మరో సినిమా వెంకిమామ విజయోత్సవం గుంటూరు లో జరగడం.. ఇక్కడ పండగ సెలెబ్రేషన్స్‌లో బిజీ అయిన రాశి ఖన్నా వెంకీమామ సక్సెస్ సెలెబ్రేషన్స్‌కి వెళ్లలేకపోవడం జరిగింది. ఇప్పటివరకు రెండు సినిమాల ప్రమోషన్స్‌ని బాగా హ్యాండిల్ చేసిన రాశి ఖన్నా వెంకిమామ సక్సెస్ ఈవెంట్ కి మాత్రం హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వెంకిమామ హైదరాబాద్‌లో కాకుండా గుంటూరులో జరగడంతో రాశి ఖన్నా డుమ్మా కొట్టాల్సి వచ్చింది. 

Raashi Khanna Missed Venky Mama Success Celebrations:

Raashi Khanna busy with Prathiroju Pandage and Venky Mama Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ