Advertisementt

ఇప్పుడందరూ ‘వెంకీమామ’ అంటున్నారంట!

Sat 21st Dec 2019 04:20 PM
venky mama,venkatesh,blockbuster celebrations,guntur,naga chaitanya  ఇప్పుడందరూ ‘వెంకీమామ’ అంటున్నారంట!
Venky Mama Vijayotsavam at Guntur ఇప్పుడందరూ ‘వెంకీమామ’ అంటున్నారంట!
Advertisement
Ads by CJ

విక్టర్ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరిగింది.

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - ‘‘సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్‌గారు ముందు నుండి మా యూనిట్  అంతటినీ ముందుండి నడిపించారు. ఆయన సహకారం మరచిపోలేం. అలాగే అభిమానులు పిలుచుకునేలాగానే నాగచైతన్య నిజంగానే బంగారం. ఇక డైరెక్టర్ బాబీగారు సినిమాను మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా డైరెక్ట్ చేశారు’’ అన్నారు.

పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ - ‘‘ఈరోజు సంతోషంగానే కాదు.. ఎమోషనల్‌గా ఉంది. వెంకీమామలో టీచర్ పాత్రకు మంచి ఆదరణ ఇస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. వెంకటేశ్‌గారికి, నాగచైతన్యగారికి థ్యాంక్స్, రాశీఖన్నా లాంటి మంచి స్నేహితురాలు దొరికింది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.

డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ - ‘‘నేను ఓ సినిమా అభిమానుల్లాగానే ఇక్కడే పెరిగాను. పవర్ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ ఇప్పుడు వెంకీమామ ఏ సినిమా చేసినా ఇక్కడ తిన్న కారమే.. ఈ మట్టిలోని దమ్ము ధైర్యమే కారణం. వెంకటేశ్, చైతన్యగారికి థ్యాంక్స్. ఇది నా నాలుగో బ్లాక్ బస్టర్. మూవీ మొఘల్ రామానాయుడుగారి డ్రీమ్‌ని నా చేతుల్లో పెట్టినప్పుడు ఎంత ఆనందపడ్డానో, అంతే టెన్షన్ పడ్డాను. మామ అల్లుళ్లను స్క్రీన్‌ మీద చూపించడం అంత సులభమైన విషయం కాదు. మంచి టీమ్ దొరికింది. సురేష్‌బాబుగారి గైడెన్స్‌లో సినిమా ఆరు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. డిసెంబర్ 13న సినిమా రిలీజ్ అని ప్రకటించగానే టెన్షన్ పడ్డాను. అయితే ప్రేక్షకుల అండతో మామఅల్లుళ్లు బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేశారు. సినిమా ఇంత పెద్ద సక్సెస్ రావడానికి కారణం.. వెంకటేశ్‌గారు, చైతన్యగారు. మావయ్యలను ఎంత నమ్మాడో నన్ను అలానే నమ్మి సినిమాలో యాక్ట్ చేశాడు. తను చాలా తెలివిగా ట్రాక్ వేసుకుంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి ఆల్బమ్ ఇచ్చాడు. నిర్మాతలు సురేష్‌బాబుగారికి, విశ్వ ప్రసాద్‌గారికి, వివేక్‌గారికి థ్యాంక్స్. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ తీస్తాను. అందరికీ పేరు పేరున థ్యాంక్స్’’ అన్నారు.

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘‘సురేష్ మామ, వెంకీమామ, డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, పాయల్, రాశీ ఇలా అందరికీ థ్యాంక్స్. ఓ మంచి సినిమాను నాకు ఇచ్చారు. అయితే ప్రేక్షకులు ఈ సినిమాలో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా చేశారు. మంచి సినిమాలు ఇవ్వగలం. కానీ బ్లాక్ బస్టర్ సినిమా చేయడమనేది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. వెంకీమామ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.

విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాకు ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యారు. చైతన్య ఒకడే నన్ను వెంకీమామ అని పిలిచేవాడు. ఇప్పుడు అందరూ ప్రేమగా వెంకీమామ అని పిలుస్తున్నారు. మహేష్‌ని తమ్ముడు అనగానే హిట్ చేశారు. వరుణ్ తేజ్‌ని కో బ్రదర్ అనగానే హిట్ చేసేశారు. ఇప్పుడు చైతు వెంకీమామ అనగానే హిట్ చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మహిళా ప్రేక్షకులే. చిన్న పిల్లల నుండి వయసు మళ్లిన బామ్మల వరకు సినిమాలు చూస్తున్నారు. ఈ ప్రేమ చూస్తుంటే 30 ఏళ్ల వయసులోనే ఉండిపోతాను. రాశీఖన్నా, పాయల్ చక్కగా యాక్ట్ చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. బాబీ చాలా పెద్ద బాధ్యతగా ఈ సినిమాను తెరకెక్కించాడు. తనకు అభినందనలు’’ అన్నారు.

Venky Mama Vijayotsavam at Guntur:

Venky Mama Movie BlockBuster Celebration Event details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ