మోస్ట్ వాంటెడ్ పెళ్ళికొడుకు లిస్ట్ లో ఉన్న హీరో నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. పెళ్లి వయసు దాటిపోయినా.. పెళ్లి ఊసెత్తని నితిన్ సినిమాలు సినిమాలు అంటూ.. బిజీ షెడ్యూల్ ల్లో ఉండిపోయాడు. తాజాగా నితిన్ పెళ్లిపీటలెక్కబోతున్నాడని, త్వరలోనే నితిన్ ఎంగేజ్మెంట్ అంటూ ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతుంది. నితిన్ కాంపౌండ్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ.. నితిన్ పెళ్లి వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరోపక్క నితిన్ భీష్మ సినిమా కోసం విదేశాలకు చెక్కేస్తున్నాడు. హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి నితిన్ భీష్మ షూట్ కోసం వెళుతున్నాడు.
అయితే నితిన్ ఎంగేజ్మెంట్ త్వరలోనే అని, పెళ్లి ఏప్రిల్ 20 అంటూ ఓ న్యూస్ బయటికి రావడం, నితిన్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి టాలీవుడ్ లో చాలా సినిమా పెళ్లిళ్లు ఏ రాజస్తానో, ఏ గోవాలోనో ఇలా ఎక్కడో ఓ చోట దూరంగా జరవుతున్నాయి. మరి నితిన్ కూడా తన పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేసుకుంటాడా? లేదంటే హైదరాబాద్ లోనే చేసుకుంటాడో అనేవారికి సమాధానం... నితిన్ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అని.. అది కూడా దుబాయ్ లో జరగబోతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. నితిన్ కి కాబోయే అమ్మాయి డాక్టరట. ఇక నితిన్ ఎక్కడ పెళ్లి చేసుకున్నా.. టాలీవుడ్ ప్రముఖులు అంతా కదలడం ఖాయమంటున్నారు. మరి నితిన్ పెళ్లి మేటర్ ఆఫీషియల్ గా బయటకొచ్చేదాకా ఈ ఊహాగానాలను భరించాల్సిందే.