Advertisementt

1న ట్రీట్ ఇవ్వబోతోన్న వర్మ!

Fri 20th Dec 2019 09:10 PM
ram gopal varma,beautiful,movie,release,january 1  1న ట్రీట్ ఇవ్వబోతోన్న వర్మ!
Varma Beautiful Movie Release Date Fixed 1న ట్రీట్ ఇవ్వబోతోన్న వర్మ!
Advertisement
Ads by CJ

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్  (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఇప్పటికే  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో  వైవిధ్య భరితంగా మలిచిన ఈ చిత్రంలో  హీరోహీరోయిన్లు సూరి, నైనా అభినయం హత్తుకుంటుంది. సన్నివేశాలతో పాటు పాటలు మదిని దోచుకుంటాయి. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష  స్పందన లభించింది. ఇక రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన... అలాగే ఆయన చిత్రాలలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎంతటి పేరు తెచ్చుకుని బిజీ అయ్యారో తెలియంది కాదు. ఈ కోవలోనే లోగడ వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ కూడా బాలీవుడ్, ఇంకా ఇతర బాషల చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ఈ చిత్రంలో రొమాంటిక్ గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది అని అన్నారు. 

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా... సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

Varma Beautiful Movie Release Date Fixed:

Beautiful Movie Ready for New Year Treat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ