Advertisementt

‘ఎంత మంచివాడ‌వురా’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ

Fri 20th Dec 2019 01:43 PM
kalyan ram,entha manchivadavuraa,movie,melody song,release  ‘ఎంత మంచివాడ‌వురా’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ
Beautiful melody from entha manchivadavuraa ‘ఎంత మంచివాడ‌వురా’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ
Advertisement
Ads by CJ

అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు అంటూ ఆక్ట‌టుకుంటోన్న‘ఎంత మంచివాడ‌వురా’ బ్యూటీఫుల్ మెలోడీ

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు ఏం న‌వ్వో ఏమో

మోగ‌మాటం పోదా వ‌య‌సుకు మెళ‌కువ రాలేదా

చెలిమంటే త‌మ‌రికి చేదా త‌గువ‌ర‌సై వ‌స్తున్నాగా

ఒక మంచి మాట అని మంచివాడివనిపించుకో చ‌క్క‌గా!!

వ‌ద్దంటే వ‌దులుతానా.. విడ‌న‌ని ముడిప‌డ‌నా

అంటూ సాగే ఈ పాటలో హీరోపై త‌న‌కున్న ప్రేమ‌ను హీరోయిన్ తెలియ‌జేస్తుంది. బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను పిక్చ‌రైజ్ చేశారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ పాట‌ను  ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ... ‘‘సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియజేసే చిత్రమిది. రీసెంట్‌గా విడుద‌లైన ‘ఏమో ఏమో ఏ గుండెల్లో ..’ అనే పాట‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేశాం. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇది ల‌వ్‌సాంగ్  త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

చిత్ర సమర్పకులు  శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ... ‘‘హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీని రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా విడుద‌ల చేశాం. ఇప్ప‌టికే విడుద‌లైన మొద‌టి పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు. మంచి స్పంద‌న వ‌స్తుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది’’ అన్నారు.

న‌టీన‌టులు: 

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, శరత్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌

నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా

సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,

సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌:

త‌మ్మిరాజు

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Beautiful melody from entha manchivadavuraa:

Entha Manchivadavuraa Melody Song Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ