హాస్యనటుడు అలీ ఇంట విషాదం
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతన్ బీబీ నిన్న సాయంత్రం 11:41నిమిషాలకు కన్నుమూశారు.
రాజమండ్రిలోని ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. రాంచీలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న అలీ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. రాజమండ్రి నుంచి జైతన్ బీబీ మృతదేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ తీసుకువచ్చారు.
అలీని పరామర్శించిన చిరంజీవి
అలీ తల్లి జైతన్ బీబీ మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్ లోని అలీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. జైతన్ బీబీ పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమండ్రిలో చనిపోవడంతో మృతదేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అలీ ఇంటికి బయలుదేరి వెళ్లారు. చాలాసేపు అక్కడే గడిపి అలీని ఓదార్చారు.