Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’ హైలెట్స్ ఇవేనంట!

Thu 19th Dec 2019 08:32 PM
mahesh babu,anil ravipudi,sarileru neekevvaru,movie,highlights  ‘సరిలేరు నీకెవ్వరు’ హైలెట్స్ ఇవేనంట!
These are the Sarileru Neekevvaru Movie Highlights ‘సరిలేరు నీకెవ్వరు’ హైలెట్స్ ఇవేనంట!
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి.. మహేష్ - అనిల్ రావిపూడి రిలాక్స్ అయ్యారనుకుంటున్నారేమో.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంటూ మహేష్ డబ్బింగ్ కి అనిల్ రావిపూడి ఇతర కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇంకా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా మొదలుకాబోతున్నాయి. ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా పాటల విషయంలో బెంగపెట్టుకోకండి.. అనిల్ రావిపూడి దర్శకత్వాన్ని నమ్మండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఎందుకంటే దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సో సో గా ఉండడంతో... అందరూ ఇలా అంటున్నారు. ఇక సరిలేరు సినిమాలో మెయిన్  హైలెట్స్ అంటూ ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ముందు నుండి చెబుతున్నట్టుగానే సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని, 20 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని, ఆ ట్రైన్ ఎపిసోడ్ లో జబర్దస్త్ బ్యాచ్ తో బండ్ల చేసే కామెడీ చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. ఇక ట్రైన్ ఎపిసోడ్ లోనే హీరోయిన్ రష్మిక, మహేష్ ని పడెయ్యడానికి పడే పాట్లని అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఇచ్చాడని టాక్. ఇక సినిమా ఓపెనింగ్ అప్పుడు తీసిన యాక్షన్ సీన్స్ కూడా మెయిన్ హైలెట్ కాబోతున్నాయని, అలాగే తమన్నా స్పెషల్ ఐటెం కూడా సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. మరి సరిలేరు టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచిన టీం.. ఇప్పుడు ప్రమోషన్స్ తో వాటిని మరింత పెంచే ప్లాన్ చేస్తుందట.

These are the Sarileru Neekevvaru Movie Highlights:

Sarileru Neekevvaru Movie Highlights Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ