Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి

Thu 19th Dec 2019 01:58 PM
sarileru neekevvaru,shoot completed,mahesh babu,anil sunkara,anil ravipudi,dil raju  ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి
Sarileru Neekevvaru Shoot Completed ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి! సంక్రాంతి కానుక‌గా జనవరి11న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌!!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు(డిసెంబ‌ర్ 18) పూర్తయింది. 

ఈ సంద‌ర్భంగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘జులై 5న మొదలైన ఈ ‘సరిలేరు నీకెవ్వరు’ మెమొరబుల్ జర్నీ డిసెంబర్18తో పూర్తయింది. సినీ ప్రేమికులకు, మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఈ సంక్రాంతి ఒక‌ మెమరబుల్‌గా ఉండబోతుంది’’ అన్నారు.

నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ.. ‘‘ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత మరపురాని జ్ఞాపకాన్నిఇచ్చిన నా ప్రియమైన సూపర్ స్టార్ మహేష్ బాబు‌కి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ అద్భుతమైన షూటింగ్‌ని సంతోషకరంగా ముగించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌, కిశోర్‌ గరికిపాటి సహా ఎంటైర్ ‘సరిలేరు నీకెవ్వరు’ యూనిట్‌కి థాంక్స్’’ అన్నారు.

ఇప్ప‌టికే విడుదలైన మూడు సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్ననాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్.  ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ ఎల్‌.బి స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్నవిష‌యం తెలిసిందే..

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Shoot Completed:

Sarileru Neekevvaru Shooting wrapped 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ