Advertisementt

‘ఐకాన్’పై వస్తున్న వార్తల్లో నిజం లేదు

Wed 18th Dec 2019 11:57 PM
icon,allu arjun,venu sriram,allu arjun icon movie  ‘ఐకాన్’పై వస్తున్న వార్తల్లో నిజం లేదు
Rumours on Allu Arjun Icon Movie ‘ఐకాన్’పై వస్తున్న వార్తల్లో నిజం లేదు
Advertisement
Ads by CJ

సుకుమార్‌తో అల్లు అర్జున్ సినిమా ఓకే అవడం పూజా కార్యక్రమాలు జరగడంతో.. అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఫిలింనగర్‌లో నడిచింది. వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా కథని సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెయ్యడమే కాదు... ఐకాన్ ని అధికారికముగా టైటిల్ తో పాటుగా ప్రకటించారు కూడా. అయితే అటు సుకుమార్‌తో అల్లు అర్జున్, ఇటు వేణు శ్రీరామ్‌తో పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఓకే అయ్యేసరికి అల్లు అర్జు ఐకాన్ అటకెక్కినట్లుగా వార్తలొచ్చాయి. దిల్ రాజు కూడా వేణు శ్రీరామ్‌తో పవన్ కళ్యాణ్ కాంబోలో పింక్ రీమేక్‌కి దిగిపోవడంతో.. అల్లు అర్జున్ -  దిల్ రాజు ఐకాన్ నిజంగానే ఆగిపోయింది అనుకున్నారు.

కానీ తాజాగా అల్లు అర్జున్ ఐకాన్ ఆగలేదని, ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. వేణు శ్రీరామ్ ఓ ఏడాది పాటు ఖాళీగా ఉండాలి గనక పవన్ కళ్యాణ్‌తో సినిమా ఒప్పుకోలేదని, అల్లు అర్జున్ ని పర్మిషన్ అడిగి పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ వేణు శ్రీరామ్ చేయబోతున్నాడని, ఎలాగూ సుకుమార్ సినిమా పూర్తయ్యాకే ఐకాన్ సినిమా ఉంటుంది కాబట్టి.. ఈలోపు పవన్ తో పింక్ రీమేక్ చెయ్యమని అల్లు అర్జునే.. వేణు శ్రీరామ్ కి చెప్పడంతో... ఆనందంతో వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్ పింక్ ని మొదలెట్టాడట. సో అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీ అటకెక్కలేదు.. ఆ సినిమా పింక్ రీమేక్ తర్వాత ఉంటుందన్నమాట.

Rumours on Allu Arjun Icon Movie:

Icon Movie not Stopped

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ