Advertisementt

బాలయ్య, బోయపాటి సినిమాకు కష్టాలే కష్టాలు..!!

Wed 18th Dec 2019 11:32 PM
balakrishna,boyapati,problems,ruler,heroine,rajasekhar,srikanth,villain,sanjay dutt  బాలయ్య, బోయపాటి సినిమాకు కష్టాలే కష్టాలు..!!
Heroine Problem to Balayya and Boyapati Movie బాలయ్య, బోయపాటి సినిమాకు కష్టాలే కష్టాలు..!!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ వలన బోయపాటికో, బోయపాటి వలన బాలకృష్ణకి కష్టాలో అర్ధం కావడం లేదు. బాలయ్యకి ‘రూలర్’ కష్టాలు, బోయపాటికి ‘వినయ విధేయ రామ’ కష్టాలతో పాటుగా.. ఇప్పుడు బాలకృష్ణకి హీరోయిన్‌ని వెతకడం కష్టంగా మారింది. బాలీవుడ్ నుండి సోనాక్షిని తీసుకొస్తున్నాడనగానే బోయపాటి - బాలయ్య సినిమాపై క్రేజ్ రావడం ఈలోపులో సోనాక్షి సిన్హా.. నేను బోయపాటి సినిమాలో నటించడం లేదంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక బోయపాటి ‘సింహా, లెజెండ్’ సినిమాలోలా యాక్షన్ కంటెంట్ పెడితే.. వినయ విధేయరామలా దెబ్బతినాల్సి వస్తుందని.. ఈసారి బాలయ్య సినిమాని బోయపాటి డివోషనల్ టచ్ ఇవ్వనున్నాడనేది తాజా సమాచారం. ఇప్పటివరకు యాక్షన్ .. ఎమోషన్‌కి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన బోయపాటి.. బాలయ్య కోసం ఈ సారి గ్రామీణ నేపథ్యంలో కథ అల్లుకుని, ఆ కథలో డివోషనల్ టచ్ ఉండేలా చూసుకున్నాడని అంటున్నారు.

మరి ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్, శ్రీకాంత్‌ల పేర్లు వినబడినాయి. అయితే ఓ విలన్ గా శ్రీకాంత్ ఫిక్స్ అని, రెండో విలన్ గా సంజయ్ దత్ కాదు.. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ అంటూ వార్తలొస్తున్నాయి. మరి గతంలో బాలయ్య సినిమాలో రాజశేఖర్ విలన్‌గా చేస్తానని చెప్పాడు. తాజాగా రూలర్ ఈవెంట్‌లో రాజశేఖర్ సందడితో బోయపాటి - బాలయ్య సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్ర చేయబోతున్నాడు అందుకే బాలయ్య రూలర్ ఈవెంట్ కి రాజశేఖర్ వచ్చాడని టాక్ మొదలైంది. మరి బోయపాటి - బాలయ్య సినిమాకోసం నానా కష్టాలు పడుతున్నాడు. మరి కష్టానికి తగ్గ పారితోషకం ఈ సినిమా కోసం బోయపాటి(15 కోట్లు) అందుకుంటున్నాడనే న్యూస్ ఉంది.

Heroine Problem to Balayya and Boyapati Movie:

Problems to Balayya and Boyapati Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ