Advertisementt

అమెరికా అబ్బాయ్‌తో రీచా పెళ్లి..? నిజమేనా!?

Wed 18th Dec 2019 03:53 PM
richa gangopadhyay,marriage,foreign boyfriend,richa-joku marriage  అమెరికా అబ్బాయ్‌తో రీచా పెళ్లి..? నిజమేనా!?
Richa Gangopadhyay Marriage With His Foreign Boyfriend అమెరికా అబ్బాయ్‌తో రీచా పెళ్లి..? నిజమేనా!?
Advertisement
Ads by CJ

రీచా గంగోపాధ్యాయ గుర్తుందా..?.. గుర్తుకు రాలేదా..? అదేనండి ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘నాగవళ్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’ చిత్రాల్లో మెరిసి తెరమరుగైపోయిందే ఆ బ్యూటీనే రీచా. అయితే భాయ్ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఈ భామ అడ్రస్ కనపడలేదు. అయితే తాజాగా.. లోకల్ మొదలుకుని నేషనల్ మీడియా వరకూ ఈ బ్యూటీ పేరు మార్మోగుతోంది. ఇందుకు కారణం ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది గనుక.

సినిమాలకు దూరమయ్యాక రీచా పెద్ద చదువుల కోసం అమెరికాక బాటపట్టింది. అక్కడ చదువుతో పాటు ఓ అమెరికన్‌ను కూడా బుట్టలో వేసుకుంది!. అంతేకాదండోయ్.. పెళ్లికూడా చేసుకుంది. అతని పేరు జోకు. రీచా-జోకు ఇద్దరూ క్లాస్‌మేట్స్. అలా ఇద్దరూ ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో తన భాయ్‌ఫ్రెండ్ అంటూ నెటిజన్లకు పరిచయం చేసింది. అయితే ఏడాది ముగిసేలోపు అనగా.. డిసెంబర్ నాటికి భాయ్‌ఫ్రెండ్ కాస్త భర్తగా మారాడని షాకిచ్చింది.

రీచా-జోకు జంట పక్షులకు ఈ మధ్యే వివాహం జరిగింది. జో క్రిస్టియన్ కావడం.. రీచా హిందూ కావడంతో.. పెళ్లి రెండు కలిసే విధంగా క్రిస్టియన్- హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. కాగా ఈ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ ఫొటోలపై రియాక్షన్ కానీ.. అధికారికంగా గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరి ‘జో’తో పెళ్లి నిజమా..? అన్నీ ఉత్తుత్తేనే అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Richa Gangopadhyay Marriage With His Foreign Boyfriend:

Richa Gangopadhyay Marriage With His Foreign Boyfriend  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ