‘సరిలేరు నీకెవ్వరు’ నుండి మండే స్పెషల్ దిగిపోయింది. హి ఈజ్ సో క్యూట్ అంటూ రష్మిక మందన్న మహేష్ బాబుని టీజ్ చేసే సాంగ్ ని వీడియోతో పాటుగా వదిలింది టీం. అయితే సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ అంతగా ఎక్కడపోయినా.. ఆ సాంగ్ లో మహేష్ వెంటపడుతూ రష్మిక మందన్న చేసిన అల్లరి, డాన్స్ మాములుగా లేదు. నిజంగా మహేష్ బాబు క్యూట్‌గానే ఉన్నాడు. కానీ రష్మిక మాత్రం మరింత క్యూట్‌గా ఈ సాంగ్‌కి హాట్ హాట్ స్టెప్స్ తో డాన్స్ ఇరగదీసింది. టీజర్ లో స్పేస్ లేదు, పోస్టర్స్ లో స్పేస్ లేదు అంటూ రష్మికతో పాటుగా ఆమె అభిమానులు కూడా తెగ ఫీల్ అయ్యారు.
అయితే రష్మిక మీద స్పెషల్ టీజర్ అంటూ కాస్త ప్రచారం జరిగినా అనిల్ రావిపూడి లైట్ తీసుకున్నాడు. కానీ సరిలేరు నీకెవ్వరు నుండి వదిలిన మూడో సాంగ్ మొత్తం రష్మిక మీదనే షూట్ చేశారు. మహేష్ బాబు బ్యాగ్ తో అలా అలా నడుస్తున్నప్పటికీ.. అందరి కళ్ళు రష్మిక డాన్స్ మీదే ఉంది. సంగీత, హరితేజలతో కలిసి రష్మిక వేసిన డాన్స్ స్టెప్స్ బీభత్సంగా ఉన్నాయ్. మహేష్ ఎలాంటి స్టెప్స్ వేయకపోయినా.. రష్మిక లుక్స్, ఆమె డ్రెస్, ఒక టైం లో రష్మిక వేసిన పల్లెటూరి గెటప్ ఇలా అన్ని రష్మికాని హైలెట్ చేసేలా ఉన్నాయి. మరి రెండు రోజులుగా మహేష్ తో రష్మిక క్యూట్ అండ్ రొమాంటిక్ పోస్టర్స్ లాగే ఈ హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లో రష్మిక డాన్స్ అండ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి.