Advertisementt

‘సరిలేరు..’ వీడియోస్ లీక్.. మహేశ్ ఆగ్రహం!

Wed 18th Dec 2019 12:53 PM
mahesh babu,serious,sarileru neekevvaru,videos leaked  ‘సరిలేరు..’ వీడియోస్ లీక్.. మహేశ్ ఆగ్రహం!
Mahesh Babu Serious Over Sarileru Videos Leaked! ‘సరిలేరు..’ వీడియోస్ లీక్.. మహేశ్ ఆగ్రహం!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన సినిమా యూనిట్ రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ అంచనాలు మరింత పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ విషయంలోనూ దూసుకెళ్తోంది. అయితే అంతే రీతిలో దర్శకనిర్మాతలను ఓ భయం పట్టిపీడిస్తోంది. అదే లీక్స్ వ్యవహారం.!. ఇంతవరకూ షూటింగ్ స్పాట్స్ నుంచి చిన్నపాటి లీక్స్ రాకుండా మేనేజ్ చేసుకున్న యూనిట్.. ఈ మధ్య ఎందుకో చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. 

రెండ్రోజుల క్రితం మహేశ్‌ బాబు డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో మహేశ్ మాస్ లుక్‌లో లుంగీ క‌ట్టుకున్నాడు. అయితే ఈ వీడియో కావాలనే లీక్ చేశారో..? ఎవరైనా పనిగట్టుకుని మరీ లీక్ చేశారో తెలియట్లేదు గానీ నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది. ఈ విషయం మహేశ్ దృష్టికి వెళ్లగా.. ఏంటిది..? అసలెవరు ఇలా లీక్స్ చేస్తున్నది..? అని దర్శకనిర్మాతలు, మూవీ యూనిట్‌పై మహేశ్ కోపగించుకున్నాడని టాక్ నడుస్తోంది. లీకయ్యిందో అయ్యింది.. ఇక ఆ సీన్ తీసేయడం.. ఇకపై ఇలాంటివి లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని తోటి నటీనటులకు సూపర్‌స్టార్ సూచించారట. కాగా..‘మైండ్ బ్లాక్..’ అనే సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ కాగా.. ఇందులో మ‌హేష్ లుంగీతో డ్యాన్స్ చేసిన విషయం విదితమే. అయితే ఈ వీడియో లీక్స్ ఈ చీవాట్లతో ఆగుతాయా..? లేకుంటే మరింత పెరుగుతాయా అనేది తెలియాల్సిందే మరి.

Mahesh Babu Serious Over Sarileru Videos Leaked!:

Mahesh Babu Serious Over Sarileru Videos Leaked!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ