Advertisementt

బన్నీ ‘టైటిల్’ కోసం బోయపాటి భగీరథ ప్రయత్నం!

Tue 17th Dec 2019 03:15 PM
  బన్నీ ‘టైటిల్’ కోసం బోయపాటి భగీరథ ప్రయత్నం!
Boyapati Fight For Stylish Star Allu Arjun Tittle! బన్నీ ‘టైటిల్’ కోసం బోయపాటి భగీరథ ప్రయత్నం!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా టైటిల్ కోసం మాస్ చిత్రాలకు కేరాఫ్ బోయపాటి శ్రీను భగీరథ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. అయితే అవి ఎంతమాత్రం సక్సెస్ అవుతాయో తెలియట్లేదు కానీ.. బోయపాటి మాత్రం పట్టువీడని విక్రమార్కుడిలాగా గట్టిగానే తగులుకున్నారట. వాస్తవానికి కాస్త వెరైటీగా రాజసంగా ఉండేలా బోయపాటి టైటిల్స్ పెడుతుంటారు. ఇప్పటికే బాలయ్య కోసం ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి టైటిల్స్ ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే హ్యాట్రిక్ చిత్రానికి ఏం టైటిల్ పెడదామని నిశితంగా ఆలోచించగా.. ఏవోవే పేర్లు తోచినప్పటికీ అవి బాలయ్యకు సెట్‌ అయ్యేలా లేవట.

అందుకే ఇక బన్నీ వద్దనుకుని వదిలేసిన ‘ఐకాన్’‌ను అరువుగా తీసుకోవాలని బోయపాటి సన్నాహాలు చేస్తున్నారట. బాలయ్య పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ‘ఐకాన్’ సరిగ్గా సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. కాగా ఈ టైటిల్ ప్రస్తుతానికి సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు దగ్గరుంది. వాస్తవానికి సరిలేరు తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కించాలని భావించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అతది జరగలేదు. అందుకే ఇక ఆ టైటిల్ తనకివ్వాలని బోయపాటి దిల్‌ను సంప్రదించారట. మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో..? ఒప్పుకుంటే సరే లేకుంటే పరిస్థితేంటనేది మాత్రం తెలియట్లేదు. మరి ఫైనల్‌గా బోయపాటి భగీరథ ప్రయత్నాలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయో వెయిట్ అండ్ సీ.

Boyapati Fight For Stylish Star Allu Arjun Tittle!:

Boyapati Fight For Stylish Star Allu Arjun Tittle!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ