Advertisementt

దర్శకుడు దొరకట్లేదు.. అందుకే ఆలస్యం: పవన్

Tue 17th Dec 2019 02:28 PM
janasenani,pink remake,ramcharan,producer,pawan fans  దర్శకుడు దొరకట్లేదు.. అందుకే ఆలస్యం: పవన్
Pawan Kalyan Opens Over Re Entry In Movies! దర్శకుడు దొరకట్లేదు.. అందుకే ఆలస్యం: పవన్
Advertisement
Ads by CJ

టైటిల్ చూడగానే.. ఇదేంటి.. పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ‘పింక్’ మూవీతో కదా.. మళ్లీ ఈ డైరెక్టర్ గోలేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఓహో పింక్ తర్వాత మరో మూవీకి డైరెక్టరా అని అనుకునేరు అస్సలు కాదండోయ్. మరి ఇంకేంటి..? అనే సందేహం కలుగుతోంది.. కదూ ఇక ఆలస్యమెందుకు ఈ ఆర్టికల్ చదివేయండి మరి.

జనసేనాని ఇటీవల తెలుగులోని ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన ఫ్యామిలీ, రాజకీయాలు, నటించబోయే సినిమాలు, నిర్మాతగా మారి నిర్మించే సినిమాలు, అన్నయ్య చిరుతో విబేధాలు, నాగబాబులోని రెండో కోణం ఇలా చాలానే ఆసక్తికర విషయాలన్నీ పంచుకున్నారు. ఈ క్రమంలో సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పడిస్తున్నారు..? అనే ప్రశ్నకు పవన్ బదులిచ్చారు. ఎస్ తాను రీ ఎంట్రీ ఇస్తున్నాను కానీ.. హీరోగా కాదు నిర్మాతగా అని స్పష్టం చేశారు. వాస్తవానికి నిర్మాతగా మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ చిత్రానికి వ్యవహరిస్తానని ఇదివరకే పవన్ చెప్పారు.

ఈ క్రమంలో.. ఎట్టకేలకు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లేటు కావొచ్చేమో కానీ పక్కాగా చెర్రీతో సినిమా ఉంటుందని.. అయితే దర్శకుడు, సరైన కథ కోసం వేచి చూస్తున్నానని.. అందుకే సినిమా ఆలస్యమవుతోందని చెప్పుకొచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మాత్రం త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తానన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా మీ సినిమాల సంగతేంటి..? అని ప్రశ్నించగా.. అవన్నీ ఇప్పుడెందుకులెండి..? రాజకీయాల గురించి మాట్లాడుదామని పవన్ టాపిక్ మార్చేశారు. మరి జనసేనాని మనసులో ఏముందో..? చెర్రీతో సినిమా ఎప్పుడు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Pawan Kalyan Opens Over Re Entry In Movies!:

Pawan Kalyan Opens Over Re Entry In Movies!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ