Advertisementt

బాబోయ్.. బాలయ్యతో నేను నటించట్లేదు!

Tue 17th Dec 2019 12:46 AM
sonakshi sinha,balakrishna,boyapati sreenu,bollywood,tollywood  బాబోయ్.. బాలయ్యతో నేను నటించట్లేదు!
Sonakshi Sinha Rubbishes Reports Of Teaming Up With Balakrishna And Boyapati Sreenu బాబోయ్.. బాలయ్యతో నేను నటించట్లేదు!
Advertisement
Ads by CJ

‘సింహా’,‘లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించిందెవరు..? బాలయ్యను ఢీకొట్టేదెవరు..? ఎవరెవరు ఈ సినిమాలో నటిస్తారనే విషయంపై ఇప్పటి వరకూ పెద్ద ఎత్తునే రూమర్స్ వచ్చాయి. త్రిష, శ్రియ, అనుష్క, నయనతార ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి. వీళ్లే కాదు.. వేదిక, సోనాల్ చౌహన్‌.. మరీ ముఖ్యంగా మహానటి కీర్తి సురేష్ పేరు కూడా వచ్చింది.  వాళ్లందర్నీ వదిలేసిన బోయపాటి ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీని సోనాక్షి సిన్హాను సంప్రదించారని ఆమె కూడా దాదాపు ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. గత వారం రోజులుగా ఈ విషయమై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. 

అయితే ఈ పుకార్లపై తాజాగా.. స్వయంగా సోనాక్షినే ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నేను హీరోయిన్‌‌గా నటిస్తున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవమే.. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను బాలయ్య మూవీలో నటించడం లేదు. త్వరలోనే నా తరువాతి ప్రాజెక్టు గురించి చెప్తున్నాను’ అని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. బాలయ్య సరసన చివరికి కేథరిన్‌ను బోయపాటి అండ్ బాలయ్య ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్యను ఢీ కొనేదెవరు..? అనే విషయానికొస్తే.. ఇంతవరకూ సంజయ్ దత్‌ను,  టాలీవుడ్‌లో అటు హీరోగా.. అప్పుడప్పుడు విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్న సీనియర్ హీరో శ్రీకాంత్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్‌పై.. సాక్షి రియాక్షన్‌పై బోయపాటి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Sonakshi Sinha Rubbishes Reports Of Teaming Up With Balakrishna And Boyapati Sreenu:

Sonakshi Sinha Rubbishes Reports Of Teaming Up With Balakrishna And Boyapati Sreenu  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ