కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, లెజెండరీ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘తూటా’ పేరుతో గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈ డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు జి.తాతరెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ధనుష్‌కి కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడం మాకు కలిసొచ్చే అంశం. ఇటీవల తమిళంలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ధనుష్ సరసన మేఘా ఆకాష్ నటుస్తున్న ఈ చిత్రాన్ని విజయభేరి వారి బేనర్‌లో డిసెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’ అన్నారు.
ధనుష్, మేఘా ఆకాష్, శశి కుమార్, రాకెందు మౌళి తదితరులు నటించిన ఈ చిత్రానికి...
మాటలు: రాకెందు మౌళి
పాటలు: అనంత్ శ్రీ రామ్, చైతన్య ప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని
ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్
సంగీతం: దర్బుక శివ
సమర్పణ: గొలుగూరి రామకృష్ణా రెడ్డి
నిర్మాతలు: జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి
రచన,దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్.