Advertisementt

‘ఇద్దరి లోకం ఒకటే’ స్వచ్ఛమైన ప్రేమ‌క‌థ‌: రాజ్‌త‌రుణ్‌

Mon 16th Dec 2019 09:34 PM
iddari lokam okate,raj tarun,shalini pandey,dil raju,  ‘ఇద్దరి లోకం ఒకటే’ స్వచ్ఛమైన ప్రేమ‌క‌థ‌: రాజ్‌త‌రుణ్‌
iddari lokam okate hero raj tarun Interview ‘ఇద్దరి లోకం ఒకటే’ స్వచ్ఛమైన ప్రేమ‌క‌థ‌: రాజ్‌త‌రుణ్‌
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్‌.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. 

నాలుగైదు జోన‌ర్స్ క‌లిపి చేసిన సినిమా!

ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ త‌రుణ్ ఇంట‌ర్వ్యూ.. ‘ఇద్దరి లోకం ఒక‌టే స్వచ్ఛమైన ప్రేమ‌క‌థ‌. నాలుగైదు జోన‌ర్స్ క‌లిపి చేసిన సినిమా కాదు. సినిమా అంతా ప్రేమే ఉంటుంది. ట‌ర్కీష్ సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా చేశాం. అందులో ఎమోష‌న్స్‌ను మ‌న‌కు త‌గిన‌ట్లు మార్చి ఈ సినిమా చేశాం. ముందు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్న త‌ర్వాత బెక్కం వేణుగోపాల్‌గారు, మా డైరెక్ట‌ర్ జీఆర్‌. కృష్ణ న‌న్ను ‘ల‌వ్ లైక్స్ కో ఇన్‌సిడెన్సెస్‌’ చూడ‌మ‌న్నారు. స‌రేన‌ని చూశాను. నాకు బాగా న‌చ్చింది. సినిమాకు నేను చూసిన త‌ర్వాత స్క్రిప్ట్‌ను నెరేట్ చేశారు. దిల్‌రాజుగారు సినిమా నిర్మాణంలో అని చెప్పగానే మ‌రింత హ్యాపీగా ఫీల‌య్యాను’ అని హీరో చెప్పాడు. 

చాలా జాగ్రత్తగా సినిమా చేశాం!

‘సినిమా చివ‌రి 30 నిమిషాలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. లోకాన్ని మ‌ర‌చిపోతాం. మాతృక‌లోని ఫీల్‌ను మిస్ చేయ‌కూడ‌ద‌ని చాలా జాగ్రత్తగా సినిమా చేశాం. ఈడోర‌కం ఆడోర‌కం త‌ర్వాత నేను చేసిన రీమేక్ మూవీ ఇది. నా గ‌త రెండు, మూడు సినిమాలు బాగా ఆడ‌లేదు. అందుక‌నే కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేయాల‌నుకున్నాను. అదే స‌మ‌యంలో నాకు తిరుప‌తి మొక్కు ఉంది. అందుక‌ని తిరుప‌తి వెళ్లి మొక్కు చెల్లించుకున్నాను. ఆ గ్యాప్‌లో చాలా క‌థ‌లు విన్నాను. చివ‌ర‌కు ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను. నా అప‌జ‌యాల నుండి మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని నేర్చుకున్నాను. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కార‌ణం వ‌ల్ల ప్రేక్షకుల‌కు న‌చ్చక‌పోవ‌చ్చు. మంచి స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకున్నప్పటికీ ప్రేక్షకుడు వ‌ర‌కు దాన్ని తీసుకెళ్లడంలో ఎక్కడో చిన్న చిన్న త‌ప్పులు చేసుంటాం. అందుకే అవి ఆద‌ర‌ణ పొంది ఉండ‌క‌పోవ‌చ్చు. సాధార‌ణంగా స్క్రిప్ట్స్ ఎంపిక‌లో నేను ఎవ‌రి స‌ల‌హాలు తీసుకోను. న‌చ్చితే ఓకే అంటాను. లేకుంటే.. లేదు. నేను నేను స్క్రిప్ట్ ఎంపిక‌కు కాస్త గ్యాప్ తీసుకున్నప్పుడు ఎక్కువ దూరాలు ప్రయాణించాను.

తిరుప‌తి మొక్కు తీర్చుకుని ఉండ‌టం వ‌ల్ల జుట్టు కూడా లేదు. కాబ‌ట్టి సినిమాల‌కు దూరంగా రెండు నెల‌లు పాటు ట్రావెల్ చేశాను. దీని వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాం. సాధార‌ణంగా సినిమా రిలీజ్ రోజు నా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తాను. సాయంత్రం రివ్యూలు చూస్తాను. జీఆర్ క‌న్విక్షన్ నాకు న‌చ్చింది. ఆర్టిస్టుల‌కు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చి న‌టింపచేస్తారు. ఏం కావాల‌నే దానిపై క్లారిటీ ఉంది. షాలిని పాండే ఫెంటాస్టిక్ పెర్ఫామ‌ర్‌. ఇప్పటి వ‌ర‌కు త‌ను చేసిన పాత్రల‌కు ఈ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. త‌ను చాలా ఎనర్జిటిక్‌గా, ఈజ్‌తో న‌టించింది. సాధార‌ణంగా నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన ప్రేమ‌క‌థ‌ల్లో నా పాత్రలో చాలా జోష్‌గా, లౌడ్‌గా ఉన్నాయి. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే నా పాత్ర చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. డ్రీమ్‌గ‌ర్ల్ రీమేక్‌తో పాటు అన్నపూర్ణ స్టూడియోలో శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా, ఓరేయ్ బుజ్జిగా సినిమాల‌ను చేస్తున్నాను. అలాగే జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమాకు సంబంధించి చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే వాటి వివ‌రాల‌ను ప్రక‌టిస్తాను’ అని రాజ్‌థరుణ్ చెప్పుకొచ్చాడు.

iddari lokam okate hero raj tarun Interview:

iddari lokam okate hero raj tarun Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ