మహేష్ సినిమాలో రష్మిక హీరోయిన్. అయితే ఆ విషయంలో రష్మిక ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. కారణం మొదటిసారి ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది కాబట్టి. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం రష్మిక ఎగ్జైట్మెంట్ ని బాగా లైట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి మహేష్ తో పాటుగా విజయశాంతి, ప్రకాష్ రాజ్, లాంటి లుక్స్ వదులుతున్నప్పటికీ.. హీరోయిన్ రష్మిక లుక్ మాత్రం వాడడం లేదు. టీజర్ లో కానీ పోస్టర్స్ లో అక్కని రష్మిక లుక్ రివీల్ చెయ్యలేదు. దానికి రష్మిక హార్ట్ అయినట్లుగా వార్తలు రావడం, అల వైకుంఠపురములో టీజర్ లో హీరోయిన్ పూజ ని హైలెట్ చేసేసరికి రష్మిక కి కోపం రావడంతో.. హడావుడిగా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ నుండి మహేష్ - రష్మికల రొమాంటిక్ లుక్ బయటికి వదిలాడు.
అయినా రష్మిక శాంతపడకుండా... తనకి తానే సరిలేరు నీకెవ్వరూ గురించి ప్రమోట్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. అందులో భాగంగానే హీ ఈజ్ సో క్యూట్ అంటూ మండే విడుదల కాబోయే సాంగ్ ప్రోమోకి రష్మిక డాన్స్ మూమెంట్స్ తో ఇరగదీస్తూ ఓ వీడియో చెయ్యడం, దాన్ని సరిలేరు టీం అధికారికంగా వదిలాడం జరిగింది. అయితే రష్మిక ఇలా డాన్స్ ని దబిడిదిబిడి చేస్తూ.. తనపై ఫోకస్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇలా ప్రోమో చేసింది, సరిలేరు సినిమా విడుదలకు దగ్గరవుతున్నప్పటికీ.. రశ్మికని అపట్టించుకోకపోవడంతో.. రష్మిక ఇలా ప్లాన్ చేసుకుంది. తప్పక టీం కూడా రష్మిక వీడియోని వదిలింది. లేదంటే.. రష్మిక ఇలా డాన్స్ చేసే వీడియో ని టీం వదిలేది కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. మరి రష్మిక ఈ సినిమాలో నటిస్తూ.. టాప్ లెవల్ కి వెళదామని కలలు కంటుంటే... అనిల్ అండ్ బ్యాచ్ మాత్రం ఆమె కలలు మీద నీళ్లు చల్లుతున్నారనిపిస్తుంది.