పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ దిల్ రాజు నిర్మాతగా.. అంటూ ప్రచారం జరగడం.. నిన్నమొన్నటివరకు ‘పింక్’ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో పవన్ రాజకీయాలనుంచి రాడు, ఈ సినిమా లేదు అనే టాక్ ఓ లెవల్లో నడిచింది. తాజాగా ఎలాంటి హడావిడి లేకుండా పవన్ కళ్యాణ్ చెయ్యబోయే పింక్ రీమేక్ ఈ రోజు శుక్రవారం దిల్ రాజు ఆఫీస్‌లో పూజ కార్యక్రమాలతో.. సైలెంట్‌గా స్టార్ట్ అయ్యిది. పవన్ కళ్యాణ్ లేకుండానే ఈ సినిమాని మొదలు పెట్టేసారు దర్శకనిర్మాతలు, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే ఈ పింక్ రీమేక్‌లో మొదట్లో పూజ హెగ్డే హీరోయిన్ అన్నారు. అలాగే పూజ కాదు సమంత అయితే బావుంటుందని దిల్ రాజు సమంతని సంప్రదించారని టాక్ నడిచింది.
తాజాగా.. తెలుగు హీరోయిన్ అంజలికి పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్‌లో హీరోయిన్ ఆఫర్ వచ్చిందని.. అలాగే మరో అభినయ నటి నివేత థామస్ కూడా పింక్ రీమేక్‌లో నటించడం కన్ఫర్మ్ అంటూ ఫిలింసర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంజలికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత బడా హీరోల సినిమాల్లో ఆఫర్స్ రాకపోయినా.. ఏదో ఓ సినిమాతో టాలీవుడ్‌కి వచ్చి అలా మెరుపుతీగలా వచ్చి మెరుస్తూనే ఉంది. ఇక నివేత థామస్ మంచి నటి, మంచి హిట్స్ ఉన్నప్పటికీ.. ఆమె హైట్ ఆమెకి శాపంలా మారింది. తాజాగా పవన్ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ పక్కా అని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మల దశ తిరిగినట్లే. ఇక మూడో హీరోయిన్.. మెయిన్ లీడ్ హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారో అనే ఊహాగానాలు ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. అయితే పింక్ ఒరిజినల్ సినిమాలో నటించిన తాప్సీ అయితేనే కరెక్ట్ అంటున్నారట దర్శకనిర్మాతలు. మరి తాప్సి పవన్ సరసన చెయ్యడానికి ఏమంటుందో చూడాలి.