సౌత్ హీరోయిన్స్ టార్గెట్ బాలీవుడ్ అనే ధ్యాసలోనే సౌత్ సినిమాలు చేస్తుంటారు. బాలీవుడ్ ఆఫర్ రాగానే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తారు. కానీ సమంత, నయనతార లాంటోళ్ళు మాత్రం సౌత్ కి న్యాయం చెయ్యాలని అనుకునే కొద్దిమంది హీరోయిన్స్ వారు ఒకరు. అయితే సమంత ప్రస్తుతం సినిమా అవకాశాలు పక్కనబెట్టి.. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ద ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ లో నెగెటివ్ రోల్ ప్లే చేస్తుంది. ఆ వెబ్ సీరీస్ షూటింగ్ చిత్రీకరణ కూడా పూర్తికావొస్తుంది. అయితే సమంతకి ఇప్పుడు ఓ బాలీవుడ్ ఆఫర్ వస్తే కలదన్నిందనే న్యూస్ నడుస్తుంది.
సమంత ఎంతో ఇష్టపడి తెలుగులో రీమేక్ చేసిన కన్నడ యు టర్న్... సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని ఒరిజినల్ దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు. అయితే తెలుగులో అదరగొట్టిన సమంత హిందీలో కూడా నటిస్తేబావుంటుంది అని సమంతని సంప్రదించారట మేకర్స్. కానీ ఒకసారి చేసిన పాత్రని మళ్ళీ చెయ్యాలంటే అంత మంచిగా అనిపించిందని.. సున్నితంగా యు టర్న్ మేకర్స్ కి చెప్పి పంపింది. మరి సమంత రిజెక్ట్ చెయ్యడంతో... యు టర్న్ లోని సమంత పాత్రని ప్రస్తుతం బాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన తాప్సితో చేపిస్తే బావుంటుందని.. తాప్సిని సంప్రదించే పనిలో యు టర్న్ మేకర్స్ ఉన్నారట.