Advertisementt

రష్మీపై తన అభిప్రాయం చెప్పేసిన సుధీర్!

Thu 12th Dec 2019 06:19 PM
rashmi,sudigaali sudheer,ali tho jaaligaa,ali,rashmi and sudheer  రష్మీపై తన అభిప్రాయం చెప్పేసిన సుధీర్!
Sudigali Sudheer Talks About Rashmi రష్మీపై తన అభిప్రాయం చెప్పేసిన సుధీర్!
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ - రష్మీ అనగానే వారి మధ్యన సంథింగ్ సంథింగ్ అంటూ బోలెడన్నీ వార్తలు వినిపిస్తాయి. జబర్దస్త్ షో లో యాంకర్ రష్మీ మీద సుధీర్ జోక్స్ వెయ్యడం, రష్మీ కూడా వాటిని పాజిటివ్‌గా తీసుకోవడం ఇదంతా వారిమధ్యన ఏదో ఉంది అనే అనుమానాలకు దారితీసింది. అయితే మా మధ్యన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే ఉందని.. బయట మాత్రం అలాంటిదేం లేదు.. అయితే రష్మీ అనే పేరు వలనే నేను బాగా హైలెట్ అయ్యా అని.. అందుకే రష్మీ నా లక్కీ గర్ల్ అంటున్నాడు సుధీర్. అలీతో జాలిగా ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ చాలా విషయాలు అలీతో ఓపెన్ గా పంచుకున్నాడు. ఏడేళ్లుగా రష్మీతో నా ప్రయాణం జబర్దస్త్‌లో సాగుతుంది, అది ఢీ జోడి తో పటిష్ఠంగా మారింది.. అంతే కానీ మా మధ్యన ఏం లేదని కుండ బద్దలు కొడుతున్నాడు సుధీర్.

ఇక జబర్దస్త్‌ని వదిలేస్తావా అని అలీ అడగగానే.. లేదు జబర్దస్త్ నా ప్రాణం, మల్లెమాల వాళ్ళు జబర్దస్త్ చెయ్యొద్దు వెళ్ళిపో అనేదాకా అందులో ఉంటా అని చెప్పిన సుధీర్, వేరే ఛానల్స్ లోను కామెడీ ఆఫర్స్ వచ్చాయని కానీ మల్లెమాల వాళ్ళు వెళ్లి షోస్ చేసుకో అంటేనే చేస్తా అని చెప్పాడు. ఇక ఒక ఏడాది బ్యాక్ పెయిన్ తో బాగా ఇబ్బంది పడ్డా అని, వెన్ను పూస మీద ఓ చిన్న కణితి వలన ప్రోబ్లెంస్ ఫేస్ చేశా అని, అయితే ఆ కణితిని తొలిగించడానికి ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పినప్పుడు భయపడ్డా అని, కానీ నెప్పి భరించలేక ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పాడు సుధీర్. ఇక రష్మీ అంటే ఇష్టమని.. కానీ ఆమె పడిన కష్టాలు,ఆత్మవిశ్వాసంతో పైకొచ్చిన విధానం చూసాక ఇష్టం ప్లేస్‌లో గౌరవం పెరిగిందని చెప్పాడు సుధీర్. 

Sudigali Sudheer Talks About Rashmi:

Rashmi is my lucky Girl says Sudhigali Sudheer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ