Advertisementt

‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’కు ఇది ఫస్ట్ విన్!

Thu 12th Dec 2019 12:59 PM
censor,praises,veera sastha ayyappa kataksham,movie,suman  ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’కు ఇది ఫస్ట్ విన్!
First Win to Veera Sastha Ayyappa Kataksham ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’కు ఇది ఫస్ట్ విన్!
Advertisement
Ads by CJ

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. సుమన్ తెలుగులో హీరోగా నటించిన ఈ చిత్రానికి వి.ఎస్.పి తెన్నేటి కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. వి.ఎస్.ఎల్ జయకుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో గాత్రమందించారు. సెన్సార్ పూర్తి చేసుకోవడంతోపాటు.. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా పొందిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వి.ఎస్.పి తెన్నేటి, రుద్రాభట్ల వేణుగోపాల్‌తోపాటు, ఈ చిత్రంలో సుమన్‌కి జంటగా నటించిన జ్యోతి పాల్గొన్నారు. 

వి.ఎస్.పి తెన్నేటి మాట్లాడుతూ.. సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందడం మా తొలి విజయంగా భావిస్తున్నాం. ప్రేక్షకుల నుంచి కూడా ఇలాంటి ప్రశంసలే అందుతాయని నమ్మకం ఉంది.. అన్నారు. తెన్నేటిగారి మార్గ దర్శకత్వంలో, అయ్యప్ప ఆశీస్సులతో అద్భుతంగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.. అని చిత్ర దర్శకులు రుద్రాభట్ల వేణుగోపాల్ పేర్కొన్నారు. జ్యోతి మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన సినిమా ఇది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే: వి.ఎస్.పి తెన్నేటి, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, నిర్మాతలు: వి.ఎస్.పి తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)

First Win to Veera Sastha Ayyappa Kataksham:

Censor Praises Veera Sastha Ayyappa Kataksham Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ