విక్టరీ వెంకటే్‌శ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘వెంకీమామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా మ్యూజికల్ నైట్ జరిగింది. ఈ సందర్భంగా ...
రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ‘‘ఈరోజు మా తాతగారు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండుండేవారు. చిన్నాన్నతో, చైతన్యతో సరదాగా ఉండేవారు. నన్ను మాత్రం పక్కకు తీసుకెళ్లి తిడుతుండేవారు. చైతు నాకంటే చిన్నోడు.. నాకంటే అన్ని ముందు చేసేస్తుంటాడు. నాకంటే కాలేజ్ ముందు పాసైయ్యాడు. నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. చిన్నాన్నతో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇక వెంకీమామ సినిమా విషయానికి వస్తే.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌కి ఇది స్పెషల్ మూవీ. 55 సంవత్సరాల్లో ఇదొక మైల్ స్టోన్. దీన్ని ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘నాకు ఎమోషనల్‌గా ఉంది. వంద సినిమాలు చేసిన నిర్మాతగానే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు చేసిన నిర్మాత ఎవరైనా ఉన్నారా? అంటే ఆ ఘనత రామానాయుడు గారికే దక్కుతుంది. మా దర్శకులందరికీ దేవుడాయన. అలాగే నిర్మాతలకు గాడ్‌ఫాదర్. 24 శాఖలవారికి సాయం చేసే ఆపద్భాంధవుడు. దగ్గుబాటి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. రామానాయుడుగారు నాన్నగారితోనే కాదు.. నాతో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే వెంకటేశ్‌ను కూడా నా సినిమాతో పరిచయం చేయమని అన్నారు. వెంకటేశ్‌గారు కూడా చక్కగా ట్రైనింగ్ తీసుకుని నటించారు. ఇక రానాను నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ కుదరలేదు. అలాగే చైతన్యను కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సింది. వీలుకాలేదు. తనతో తప్పకుండా సినిమా చేస్తాను. రుషిలాంటి రామానాయుడుగారి కోరిక తీరిన రోజుది. ఆయన ఆశీర్వాధాలు ఎప్పటికీ ఉంటాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ‘‘వెంకటేశ్, రానా, చైతులు కలిపి నాన్నగారు ఓ సినిమా చేయాలనుకునేవారు. ఈ సినిమా బంధాలు, అనుబంధాల గురించి చెప్పే సినిమా. కె.ఎస్.ప్రకాశ్‌రావుగారు మా నాన్నగారితో మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఆయన చేసిన ప్రేమ్‌నగర్ సినిమాలు మా జీవితాలను మార్చివేసింది. తర్వాత నేను అమెరికా నుండి తిరిగొచ్చాను. అప్పుడు రాఘవేంద్రరావుగారు మాతో చేసిన దేవత సినిమా వల్ల మా బ్యానర్ సక్సెస్ కంటిన్యూ అయ్యింది. ప్రకాశ్‌రావుగారు తీసిన వసంతమాలిగై సినిమాను 45 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా ఆ సినిమా 100 రోజులు ఆడింది. అలాంటి గొప్ప సినిమా ఇది. రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి మేం రుణపడి ఉన్నాం. నాకు డైరక్షన్ గురించి కాస్తో కూస్తో నేర్పించింది రాఘవేంద్రరావుగారే. ఆయన అన్ని జోనర్ సినిమాలను తెరకెక్కించారు’’ అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది. బాబీగారికి థ్యాంక్స్. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
రాశీఖన్నా మాట్లాడుతూ - ‘‘‘వెంకీమామ’ సినిమాలో వెంకటేశ్‌గారు, చైతన్యతో కలసి నటించడం ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎగ్జయిట్‌గా వెయిట్ చేస్తున్నాం. బాబీగారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. ప్రతి పాత్రను చక్కగా డిజైన్ చేశారు. సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో టీచర్ పాత్రలో నటించాను. ఇలాంటి పాత్రలో నటిచండం ఇదే తొలిసారి. చాలా ఆసక్తిగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు. బాబీగారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ - ‘‘సినిమాకు సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకటేశ్‌గారి పుట్టినరోజుకి చైతన్య, సురేష్ ప్రొడక్షన్స్, నా తరపునుండి ఇస్తున్న గిఫ్ట్‌గా ఈ సినిమాను భావిస్తున్నాం. యూనిట్ అంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు రామానాయుడుగారుండుంటే ఎంతో ఆనందించేవారు. డిసెంబర్ 13న వెంకీమామకు అల్లుడు చైతు సాలిడ్ గిఫ్ట్‌ను ఇస్తున్నాడు. చైతన్యలోని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ సహా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘ఏ సినిమాకు ఇంత నెర్వస్‌గా లేను. 13వ తారీఖు ఎప్పుడోస్తుందో, ఎలాంటి ఫలితం ఉంటుందో అని అనుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అది మా తాతగారి కోసం. ఈ సినిమా మా తాతగారి డ్రీమ్. సురేష్ ప్రొడక్షన్స్, వెంకీమామతో కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరిక ఈ సినిమాతో ఈ రెండు కోరికలు తీరిపోయాయి. మా యూత్ అందరికీ వెంకీమామ ఇంకా యూతే. సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఫోన్ చేశారు. ఈ క్రెడిట్ బాబీకే ఇవ్వాలి. తనకు థ్యాంక్స్. తను దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్‌తో ట్రావెల్ అయ్యాడు. తన టీమ్‌కి, థమన్‌కి థ్యాంక్స్. థమన్ పాటలకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. తను మంచి సంగీతం, ఆర్ .ఆర్ ఇచ్చాడు. రాశీఖన్నా, పాయల్‌కి థ్యాంక్స్. ప్రసాద్ మూరెళ్ళగారికి థ్యాంక్స్. డిసెంబర్ 13న మీ అందరిని థియేటర్స్‌లో కలుస్తాను’’ అన్నారు.
విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘డిసెంబర్ 13న వెంకీమామ ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్‌తో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. మా నాన్నగారు నాతో, చైతుతో సినిమా చేయాలని బలంగా అనుకున్నారు. ఆయన కోరికతోనే ఈ కథ మా దగ్గరకి వచ్చింది. బాబీ, అతని టీమ్ అద్భుతమైన వర్క్ చేశారు. ప్రసాద్ మూరెళ్ల, ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థమన్ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. రాశీఖన్నా, పాయల్‌లతో మరోసారి కలిసి పనిచేయాలనుకుంటున్నాను. నా కెరీర్‌లో తొలిసారి నా బర్త్‌డేకు వస్తున్న సినిమా ఇది. అభిమానులు అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు నేను మంచి సినిమాలు చేసిన ప్రతిసారి ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్, రైటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా థమన్ లైవ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు.
నటీనటులు:
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్