Advertisementt

‘అల..’ టీజర్‌లోనే అన్నీ టచ్ చేశారుగా..!!

Thu 12th Dec 2019 12:48 AM
ala vaikunthapurramloo teaser,ala vaikunthapurramloo teaser released,allu arjun,trivikram srinivas  ‘అల..’ టీజర్‌లోనే అన్నీ టచ్ చేశారుగా..!!
Ala Vaikunthapurramloo Teaser Talk ‘అల..’ టీజర్‌లోనే అన్నీ టచ్ చేశారుగా..!!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ అంచనాలు.. అల్లు అర్జున్ క్రేజ్.. అన్ని ‘అల వైకుంఠపురములో’ టీజర్‌లో అలా అలా కనిపించేసాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, త్రివిక్రమ్ పంచ్ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ అన్ని అల్లు అర్జున్ అలా అలా పండించేసాడు. ఫ్యామిలీ, కామెడీ, మాస్ అని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునే టీజర్ అల వైకుంఠపురములో. మెగా ఫ్యాన్స్ ఏం కోరుకున్నారో అంతకు మించి అన్నట్టుగా టీజర్ కటింగ్ ఉంది. భారీ అంచనాలు నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ టీజర్‌లో బన్నీ మాస్ లుక్స్, పంచ్ డైలాగ్స్, కామెడీ యాక్షన్ అన్ని అదుర్స్. కాకపోతే ఈ సినిమాలో ‘వైకుంఠపురం’ అనే ఇంటికి అల్లు అర్జున్‌కి ఉన్న సంబంధమే ఎవరికీ అర్ధం కాలేదు.

ఇక టీజర్ లోకి వెళితే..  మీనాన్న పెళ్లి కూతుర్ని దాచిన‌ట్టు దాచాడు నిన్ను.. అనే డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌లైంది. సుశాంత్, అల్లు అర్జున్ వెనకగా ఉండగా.. అల్లు అర్జున్ లుక్ రివీల్ కావడం, ఓ ఆఫీస్ లో బాస్ లేదా ఎంప్లొయ్ కానీ... పూజ హెగ్డే‌ని మేడం అంటూ బన్నీ సంబోధించడం, నవదీప్, రాహుల్ రామకృష్ణ కామెడీ పనులు, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్, ఫైట్ చేస్తూ.. స్టయిల్‌గా ఉంది కదా నాక్కూడా నచ్చింది అని వెరైటీగా చెప్పిన డైలాగ్ అయితే కేక. ఇక ప్రతి ఫ్రేమ్ లోను పేరున్న నటులు ఉండడం, మురళి శర్మ, జయరామ్ ఇలా అందరూ పేరున్న, పరిచయం ఉన్న నటులు ఉండడం, ఇక టీజర్ చివర్లో సముద్రఖని మాసివ్ లుక్ తో కాస్త మాస్ గా కారు దిగగా.. మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కా.. అనే అల్లు అర్జున్ డైలాగ్ అయితే సూపర్ అనేలా ఉంది. మరి త్రివిక్రమ్ నుండి ఎలాంటి సినిమా రావాలో అలాంటి సినిమానే అలా వైకుంఠపురములో.. అనేది ఈ టీజర్ తోనే చెప్పేసారు.

Click Here for Teaser

Ala Vaikunthapurramloo Teaser Talk:

Ala Vaikunthapurramloo Teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ