జనవరి 26న చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతగా రాహుల్ విజయ్, బీవీ సూర్య కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రారంభం
ప్రముఖ వ్యాపారవేత్త, ప్యాషనేట్ ఫిలిం మేకర్ చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతగా శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు. యువ హీరో రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రముఖ సీనియర్ స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తన నటనతో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు రాహుల్ విజయ్. డెబ్యూ డైరెక్టర్ బీవీ సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం జనవరి 26న లాంఛనంగా ప్రారంభం కానుంది. జనవరి 27 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బీవీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయికార్తీక్ మ్యూజిక్, ఈశ్వర్ యెల్లు మహంతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
బ్యానర్: శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: బీవీ సూర్య
మ్యూజిక్: సాయికార్తీక్
కెమెరా: ఈశ్వర్ యెల్లు మహంతి
రచయితలు: పి.రామరాజు, సన్ని నాగబాబు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్