Advertisementt

చిరంజీవికి కథ నచ్చింది.. పిచ్చ కామెడీనే!?

Wed 11th Dec 2019 07:21 PM
chiranjeevi,next movie,top director trivikram,koratala siva,comedy  చిరంజీవికి కథ నచ్చింది.. పిచ్చ కామెడీనే!?
Chiranjeevi Next Movie With Top Director! చిరంజీవికి కథ నచ్చింది.. పిచ్చ కామెడీనే!?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఒక్క సినిమా అయినా చూడాలన్నదే మెగాభిమానుల కోరిక. ఎప్పట్నుంచో ఈ కాంబో కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక త్వరలో నెరవేరబోతోంది. ఎందుకంటే డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. అవునా..? ఎప్పుడు పట్టాలెక్కనుంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివతో మెగాస్టార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేసిన చిత్రబృందం షూటింగ్ షురూ చేసింది. అయితే షూటింగ్ ఇంకా పూర్తిగా సెట్స్ మీదికి పోలేదు.. ఎందుకెళ్లలేదు.. కారణాలేంటి..? అనేది ఇక్కడ అసందర్భం.. అప్రస్తుతం. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లక ముందే చిరుకు మరో కథ వచ్చింది.. లైన్ విన్నాక నచ్చేసింది కూడా. ఆ కథ చెప్పింది ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇటీవలే ఓ సందర్భంలో చిరుకు సింగిల్ లైన్ చెప్పగా.. వావ్ సూపర్బ్ అని కితాబిచ్చారట. ‘ఫుల్ స్టోరీ సిద్ధం చెయ్ త్రివిక్రమ్.. చూద్దాం’ అని చిరు చెప్పగా.. ఆ పనిమీద ప్రస్తుతం త్రివిక్రమ్ .. ఆయన అసిస్టెంట్స్ బిజీబిజీగా ఉన్నారట.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురంలో..’ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది. జనవరి 2020 సంక్రాంతికి సినిమా వచ్చేస్తోంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు ఖాళీగానే ఉంటాడు. అందుకే ఈ క్రమంలో చిరుకోసం చిన్న లైన్ వినిపించగా ఆయనకు నచ్చడం.. ఫుల్ స్టోరీ కావాలని చెప్పడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయట. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా హీరో ఖచ్చితంగా కామెడీ పండించాల్సిందే. చిరు కామెడీకి ఏ మాత్రం వెనక్కి తగ్గరు.. ఈ విషయం మెగాభిమానులు, సినీప్రియులకు ‘ఠాగూర్’, ‘అందరివాడు’ సినిమాతో తెలిసే ఉంటుంది. ఈ కాంబో నిజమైతే మాత్రం ఇక పిచ్చ కామెడీనే.. అంతేకాకుండా కాసుల వర్షానికీ కొదువుండదు. మరి ఇది ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..? ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇటు మెగా కాంపౌండ్ నుంచి.. లేదా మాటల మాంత్రికుడి నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే.

Chiranjeevi Next Movie With Top Director!:

Chiranjeevi Next Movie With Top Director!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ