Advertisementt

‘వెంకీమామ’లో సర్‌ఫ్రైజ్.. మెరుపుతీగలా సామ్!

Wed 11th Dec 2019 07:13 PM
special screening,venky mama,samantha,venkatesh daggubati,naga chaitanya  ‘వెంకీమామ’లో సర్‌ఫ్రైజ్.. మెరుపుతీగలా సామ్!
Special Screening Of Venky Mama For Samantha! ‘వెంకీమామ’లో సర్‌ఫ్రైజ్.. మెరుపుతీగలా సామ్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కిన మ‌ల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ‌’. విక్టరీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో ఊహాగానాలు.. మరెన్నో రూమర్స్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. 

ఈ సినిమాలో రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌తో పాటు చైతూ సతీమణి సమంత కూడా మెరవనుందనేదే ఆ అప్డేట్ సారాంశం. సిచువేషన్ డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక తప్పని పరిస్థితిలో ‘వెంకీమామ’లో సమంత అతిథి పాత్రలో నటించిందట. అయితే సినిమాలో అతిథి పాత్ర సినిమాకు హైలైట్ నిలుస్తుందట. మొదట ఈ పాత్ర చేసేందుకు సామ్ ఒప్పుకోనప్పటికీ చై రంగంలోకి దిగడంతో ఒప్పుకోక తప్పలేదట. సమంతకు ఉండే క్రేజ్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందనే ఉద్దేశంతోనే అతిథిగా తీసుకొస్తున్నారట. 

వాస్తవానికి మొదట ఈ పాత్ర గురించి రివీల్ చేయాలని దర్శకనిర్మాతలు భావించారట. అయితే ట్విస్ట్.. సర్‌ఫ్రైజ్ ఏదో ఒకటి ఉండాలి కదా అని.. సామ్ పాత్రను రివీల్ చేయకుండా చాలా గోప్యంగా ఉంచారట. అంటే అతిథిగా అలా వచ్చి ఇలా మెరుపుతీగలాగా సమంత మెరవనుందన్న మాట. మరి ఈ మెరుపు తీగ పాత్ర సినిమాకు ఏ మాత్రం కలిసొస్తుందో మరి. ఈ పాత్ర గురించి ఎలా లీక్ అయ్యిందో తెలియట్లేదు కానీ ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద హడావుడే జరుగుతోంది. కాగా.. ఇటీవలే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘వెంకీమామ’ యూ/ఏ సర్టిఫికేట్ దక్కించుకున్నాడు.

Special Screening Of Venky Mama For Samantha!:

Special Screening Of Venky Mama For Samantha!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ