Advertisementt

‘దొంగ’ ట్రైలర్: కార్తీ ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌!

Wed 11th Dec 2019 04:56 PM
karthi,jyothika,donga,movie,trailer,release  ‘దొంగ’ ట్రైలర్: కార్తీ ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌!
Karthi Donga Movie Trailer Released ‘దొంగ’ ట్రైలర్: కార్తీ ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌!
Advertisement
Ads by CJ

న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు.. అన్ని ఎమోషన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ  ‘దొంగ’ ట్రైలర్.

‘ఖైదీ’ లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై ‘దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్‌ 10న చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

‘‘చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే’’ అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలౌతుంది. ‘ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్‌.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు..’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో కార్తీ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథకి తగ్గ యాక్షన్‌ కూడా ఉందని తెలుస్తోంది. ఇక ట్రైలర్‌ చివర్లో.. ‘‘ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా.. ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క..’’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్ లో ఆయన ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌ అనే చెప్పాలి.

ఈ సందర్భంగా హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు ట్రైలర్‌ విడుదల చేశాం. యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ ఉన్న చిత్రం ‘దొంగ’ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని మాకు అందించడానికి సంపూర్ణ సహకారం అందించిన కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. డిసెంబర్‌ 20న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నికిలావిమల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి. రాజశేఖర్‌, సంగీతం: గోవింద వసంత, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

Click Here for Trailer

Karthi Donga Movie Trailer Released:

Karthi Donga Movie Trailer Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ