‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్వేతా బసు ప్రసాద్.. తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో ‘ఎకడా..’ అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్‌లోనే ఉంది. అలా ఈ హాట్ బ్యూటీ తొలి చిత్రంతోటే హిట్ అందుకోవడంతో ఇక ఈమెకు తిరుగులేదని అవకాశాలు కొదవుండదని అందరూ భావించారు. అయితే ఆశించిన విధంగా కాకుండా సీన్ మొత్తం రివర్స్ అవ్వడంతో శ్వేత ఇబ్బందుల్లో పడటం.. చివరికి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టు పడటం.. ఇలా ఈమెపై వ్యభిచారి అనే ముద్ర పడటంతో కొద్దిరోజుల పాటు సినిమాలకి దూరమైపోయింది. ఈ క్రమంలోనే శ్వేతా పెళ్లి చేసుకోవడం.. సినిమాలకు దూరం కావాలని భర్త చెప్పడంతో నటనకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ‘ది తాష్కెంట్ ఫైల్స్’ సినిమాలో నటించింది. అంతేకాదు.. ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది.
శ్వేతాబసుకు మళ్లీ మంచిరోజులొచ్చేశాయ్ అని కుటుంబీకులు, ఆమె వీరాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న టైమ్‌లో ఉన్నట్టుండి బాంబ్ పేల్చింది. పెళ్లయిన ఏడాదికే భర్తతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా శ్వేతా బసు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. భర్తతో తాను విడిపోతున్నానని.. కొన్ని నెలలు పాటు లోతుగా ఆలోచించి ఫైనల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవలేమనంటే.. అది చెడు పుస్తకం కాదని కొన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలో వదిలేయడమే ఉత్తమం అని తెలుసుకున్నానని శ్వేత చెప్పింది. తనలో ఇన్ని రోజులు మధురమైన అనుభూతులను మిగిల్చి స్ఫూర్తి నింపిన రోహిత్‌కు థ్యాంక్స్.. మీ జీవితం గొప్పగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని శ్వేతబసు సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
మొత్తానికి చూస్తే.. 2018 డిసెంబర్ 13న పూణేలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో శ్వేతాబసు పెళ్లి జరిగింది. అంటే 2019 డిసెంబర్ 13 నాటికి ఏడాది పూర్తి కానుంది. అయితే సరిగ్గా ఏడాది పూర్తికాక మునుపే ఈ పెళ్లి కాస్త పెటాకులైంది!. అసలే అరకొర అవకాశాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ ముద్దుగుమ్మ సినీ జీవితంపై.. ఈ ప్రభావం ఏ మాత్రం పడుతుందో..? అసలు శ్వేత భవిష్యత్తు ఏంటి..? అనేది ప్రశ్నార్థకంగానే మారింది.