టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు యమా స్పీడ్ మీద ఉన్నాడు. గ్యాప్ లేకుండా డైరెక్టర్లకు అపాయిట్మెంట్లు ఇచ్చేశారు. ‘భరత్ అనే నేను’ తర్వాత ‘మహర్షి’ దాని తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మహేశ్ కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురైదుగురు డైరెక్టర్లే క్యూలో ఉన్నారు. అయితే మహేశ్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడా..? అనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. అయితే తనకు ‘మహర్షి’ మూవీతో సూపర్ డూపర్ హిట్టిచ్చిన వంశీ పైడిపల్లికే మహేశ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఈ మేరకు ఆయన స్టోరీ లైన్ వినిపించగా.. సూపర్బ్ అని కితాబిచ్చిన మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమా తనకు 27వది కావడంతో కాస్త ఫ్రిస్టేజ్‌గానే తీసున్నట్లుగా సమాచారం.
మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ దాదాపు అంతా అయిపోవడంతో వంశీ స్పీడ్ పెంచారట. ఈ మేరకు ఇప్పటికే ప్రొడ్యూసర్‌గా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు దిల్‌రాజుగా వ్యవహరిస్తున్నారట. అంతేకాదు.. ఇరువురూ కలిసి హీరోయిన్‌గా ఎవరు తీసుకోవాలి..? ఏయే పాత్రలకు ఎవరైతే సెట్ అవుతారనే విషయాలను మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహేశ్ సరసన నటించాలని ఒకప్పుడు టాలీవుడ్‌ను తన అందచెందాలతో ఏలిన శృతి హాసన్‌ను సంప్రదించారని తెలిసింది. సూపర్‌స్టార్ సరసన అనేసరికి మారుమాట చెప్పకుండా ఆ ముద్దుగుమ్మ ‘నేను రెఢీ’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
కాగా.. శృతి-మహేశ్ కలిసి నటించడం ఇదేం కొత్తకాదు. ఇదివరకే ‘భరత్ అనే నేను’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ భామ తెలుగులో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇవన్నీ అటుంచితే వంశీకి ఈ బ్యూటీ ఫేవరేట్ అండ్ లక్కీయెస్ట్ హీరోయిన్ కూడా. ఇదివరకే మెగా హీరో రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో శృతినే హీరోయిన్.. ఈ సినిమాను వంశీనే తెరకెక్కించాడు. మొత్తానికి చూస్తే శృతి పరిస్థితేంటో ఇటు మహేశ్‌కు.. అటు వంశీకి క్లారిటీగా తెలుసుగనుక ఆ తమిళ కుట్టీని తీసుకోవాలని ఫైనల్‌గా ఫిక్స్ అయ్యారట. అయితే ఈ పుకారులో ఏ మేరకు నిజం ఉన్నది..? అసలు ఈ కాంబోలో సినిమా ఉందా..? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచిచూడాల్సందే.