అల్లు అర్జున్ తో కలిసి స్టెప్స్ వేయాలంటే.. కావాలని కాళ్ళు విరగ్గొట్టుకోవడమే అంటూ.. ఈమధ్యన ఓ యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అవికా గోర్ ని అల్లు అర్జున్ తో డాన్స్ చెయ్యాలనుకుంటున్నారా అని అడగ్గానే.... ఎవరైనా ఆయనతో డాన్స్ చేసి కాళ్ళు విరగ్గొట్టుకోవాలనుకుంటారా అంటూ ఫన్నికామెంట్స్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా అల్లు అర్జున్ తో డాన్స్ అంత ఈజీ కాదంటుంది. పూజా హెగ్డేకి డీజేతో అల్లు అర్జున్ డాన్స్ పరిచయం ఉంది కాబట్టి.. అల వైకుంఠపురములో పూజా హెగ్డేకి అల్లు అర్జున్ డాన్స్ పెద్దగా ప్రాబ్లమ్ అనిపించలేదు.
కానీ రెండో హీరోయిన్ నివేత పేతురాజ్ మాత్రం అమ్మో బన్నీతో డాన్సా అంటుంది. మరి ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డాన్స్ పరిచయం లేని నివేత పేతురాజ్ కి అల్లు అర్జున్ తో డాన్స్ చెయ్యాలి అంటే తాతలు దిగిరావడం ఖాయమంటుంది. అంత గొప్ప డాన్సర్ ని ఇంతవరకు చూడలేదు అంటూ బన్నీ డాన్స్ లను తెగ పొగిడేస్తోంది ఈ చిన్నది. రాములో రాముల పాట ఎంత క్లోక్ అయ్యిందో.. ఆ సాంగ్ లోని స్టెప్స్ వెయ్యడానికి అల్లు అర్జున్ పక్కన చాలా ఇబ్బంది పడిందట. అల్లు అర్జున్ చూపించే డాన్స్ మూమెంట్స్ కి నివేత విస్తుపోయింది. అయితే ఇంకోసారి గనక అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ వస్తే... ఈసారి డాన్స్ ప్రాక్టీసు చేసి మరీ అల్లు అర్జున్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటా అని చెబుతుంది నివేత పేతురాజ్.