Advertisementt

మహేష్, బన్నీల మధ్య ఆసక్తికరమైన ఫైట్..!

Tue 10th Dec 2019 07:54 PM
mahesh babu,sarileru neekevvaru,allu arjun,ala vaikunthapurramloo,competition,sankranthi,tollywood  మహేష్, బన్నీల మధ్య ఆసక్తికరమైన ఫైట్..!
Mahesh Babu vs Allu Arjun at Tollywood Box Office మహేష్, బన్నీల మధ్య ఆసక్తికరమైన ఫైట్..!
Advertisement
Ads by CJ

సంక్రాంతి బరిలో ఉన్న స్టార్ హీరోస్ మహేష్, అల్లు అర్జున్ తమ సినిమాలు విడుదల డేట్ ఇచ్చినప్పటి నుండి నువ్వా నేనా అంటూ ప్రమోషన్స్ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కామ్ గా అల వైకుంఠపురములో సాంగ్స్ వదిలితే.. మహేష్ పోస్టర్స్ తో రెడీ అయ్యాడు. ఇక మహేష్ టీజర్ అనగానే అల్లు అర్జున్ మూడో సాంగ్ అంటూ... సరిలేరు నీకెవ్వరు టీజర్ కి పోటీగా ఓ మై గాడ్ డాడీ సాంగ్ వదిలాడు. ఇలా సోషల్ మీడియాలో ఇద్దరు హీరోలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోపక్క ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమానే ట్రెండింగ్ లో ఉండేలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయితే అప్పుడు సరిలేరు టీజర్, అల్లు అర్జున్ అల సాంగ్ ని తొక్కేసింది.

తాజాగా సరిలేరు నీకెవ్వరు సోమవారం ప్రమోషన్స్ లో భాగంగా రెండో సోమవారం సూర్యుడివో చంద్రుడివో సాంగ్ వదులుతున్నట్టుగా రెండు రోజుల ముందు నుండి హడావిడి మొదలెడితే అల్లు అర్జున్ ఊరుకుంటాడా అల వైకుంఠపురములో టీజర్ డేట్ పోస్టర్స్ తో హంగామా మొదలెట్టాడు. నిన్న సోమవారం సరిలేరు సూర్యుడివో చంద్రుడివో సాంగ్ వదిలారు. ఇక అల వైకుంఠపురములో టీజర్ రేపు విడుదల కాబోతుంది. అయితే హీరోస్ మధ్యన  జరుగుతున్న కోల్డ్ వార్.. ఫ్యాన్స్ మధ్యన డైరెక్ట్ వార్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎవరి హీరో సినిమా ట్రెండింగ్ లో ఉండాలనే దానిమీదే ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. అయితే అల వైకుంఠపురములో మొదటి రెండు సాంగ్స్ తో పోలిస్తే మహేష్ సరిలేరు టీం వదిలిన రెండు సాంగ్స్ మహేష్ ఫ్యాన్స్ కి కిక్కివ్వలేదు. అందుకే అల టీజర్ ని ట్రెండింగ్ లోకి రాకుండా మహేష్ ఫ్యాన్స్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా టాక్.

Mahesh Babu vs Allu Arjun at Tollywood Box Office:

Sarileru Neekevvaru vs Ala Vaikunthapurramloo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ