Advertisementt

బాలయ్య కోసం మాస్ డైరెక్టర్ ‘పాత కథ’!

Tue 10th Dec 2019 03:40 PM
nandamuri balakrishna,balayya,vv vinayak,chennakesava reddy  బాలయ్య కోసం మాస్ డైరెక్టర్ ‘పాత కథ’!
Mass Director vinayak- balayya combo.. New Film Details Here..! బాలయ్య కోసం మాస్ డైరెక్టర్ ‘పాత కథ’!
Advertisement
Ads by CJ

మాస్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా పేరుగాంచిన ద‌ర్శకుడు వివి వినాయ‌క్. ఇప్పటి వరకూ సినిమాలు తెరకెక్కించి అలిసిపోయిన వినాయక్.. నేనూ హీరోగా నటిస్తానంటూ  ‘సీనయ్య’గా వచ్చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఏంటో తెలియని పరిస్థితి. అయితే ఈ సినిమా షూటింగ్ అవ్వగానే వివి చాలా బిజిబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. తన ఫేవరెట్ హీరో.. అప్పట్లో చిటికేసినా.. తొడగొట్టినా సుమోలు లేపించిన బాలకృష్ణతో మరో సినిమాను తెరకెక్కించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్న ఆయన.. బాలయ్య అపాయిట్మెంట్ కోసం వేచి చూస్తున్నాడట.

వాస్తవానికి ఈ ఇద్దరి కాంబోలో గతంలోనే ‘చెన్నకేశవరెడ్డి’ వచ్చింది. ఈ చిత్రం అటు బాలయ్యకు.. ఇటు వినాయక్‌కు బాగానే ప్లస్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సైతం రాబట్టింది. అయితే ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయాలనుకున్నా  అస్సలు వీలు కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఆఖరికి ‘జైసింహా’ కి ముందు కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ సన్నాహాలు చేసుకున్నప్పటికీ కథ అంతా విన్నాక సెకాండాఫ్‌లో తేడా కొట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకూ ఆ కథను అలాగే పెట్టుకున్న వినాయక్ ఎప్పటికైనా బాలయ్యకే ఆ కథ అని ఫిక్సయ్యాడట. అంటే అప్పట్నుంచి ఆ పాత కథ బాలయ్యకోసమే అలాగే పెట్టాడన్న మాట.

అందుకే ఈ మధ్యే ఓ సందర్భంలో సెకాండాఫ్ చెప్పగా ‘శభాష్ బాగుంది’ అని బాలయ్య మెచ్చుకున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇటు ‘సీనయ్య’.. అటు బోయపాటితో బాలయ్య సినిమా అవ్వగానే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఇద్దరూ ఓ మాట అనుకున్నారట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కాంబో సినిమాపై వస్తున్న పుకార్లలో నిజమెంతుందో..? అనేది తెలియాలంటే బాలయ్యగానీ.. సీనయ్యగానీ స్పందించాల్సిందే మరి.

Mass Director vinayak- balayya combo.. New Film Details Here..!:

Mass Director vinayak- balayya combo.. New Film Details Here..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ