Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి సోల్ ఫుల్ మెలోడీ!

Mon 09th Dec 2019 03:04 PM
sarileru neekevvaru,second song,melody song,devisri prasad,mahesh babu  ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి సోల్ ఫుల్ మెలోడీ!
Sarileru Neekevvaru Movie Second Song Release Details ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి సోల్ ఫుల్ మెలోడీ!
Advertisement
Ads by CJ

సూపర్ మెలోడీ సాంగ్ గా సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్,  డిసెంబర్ 9న (సోమవారం) సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవితో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీ మెలోడీ సాంగ్‌గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ‌గా ఈ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి సంబంధించి విడుదలైన పోస్టర్ కూడా ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉండే క్లాసీ సాంగ్‌గా ఉండనుందని తెలియజేస్తోంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ‌కి పరిచయం అవుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు టీం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్, ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌గా, సంక్రాంతి ఎంటర్టైనర్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Movie Second Song Release Details:

Second Song from Sarileru Neekevvaru Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ