Advertisementt

అమ్మట్లేదు.. అని ‘అల’ మాటతప్పారుగా..!

Sat 07th Dec 2019 09:34 PM
allu arjun,ala vaikunthapurramloo,digital rights,netflix  అమ్మట్లేదు.. అని ‘అల’ మాటతప్పారుగా..!
Bunny And Team Fail To Deliver The Promise అమ్మట్లేదు.. అని ‘అల’ మాటతప్పారుగా..!
Advertisement
Ads by CJ

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వలన నిర్మాతలు సేవ్ అయినా.. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు... సినిమా విడుదలైన నెలకే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సినిమాని పెట్టెయ్యడంతో... ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మానేస్తున్నారు. సినిమా టైటిల్ కార్డ్స్ లోనే డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ డైరెక్ట్ ఇలా పేర్లు వేసేస్తుంటే.. ప్రేక్షకులు దానికి కనెక్ట్ అయ్యి థియేటర్స్ కి రావడం లేదని అంటున్నారు. అందుకే ఇక నుండి డిజిటల్ హక్కులను విక్రయించడానికి నిర్మాతలు సుముఖంగా లేరని అన్నారు. అందులో మొదటిలో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నిర్మాతలు ఆ సినిమా డిజిటల్ హక్కులను అమ్మడం లేదని అన్నారు.

కానీ తాజాగా అల వైకుంఠపురములో సినిమాకి ఏర్పడిన భారీ డిమాండ్ వలన నిర్మాతలు తలొంచాల్సి వచ్చిందనే టాక్ వినబడుతుంది. బడ్జెట్ భారీగా పెట్టడంతోనే.. డిజిటల్ హక్కుల విక్రయానికి అల నిర్మాతలు సిద్ధపడ్డారని ఫిలింనగర్ టాక్. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ దిగ్గజాలు.. అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ పడ్డాయని.. చివరికి భారీ ధరకు ‘అల’ డిజిటల్ రైట్స్ ని విదేశీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని వినికిడి. మరి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ క్రేజ్ తోనే ఈ సినిమాకి ఓ రేంజ్ ధరలు పలుకుతున్నాయని, శాటిలైట్, డిజిటల్ మాత్రమే కాకుండా థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నట్టుగా అల టీం చెబుతుంది.

Bunny And Team Fail To Deliver The Promise:

Ala Vaikunthapurramloo Digital Rights To Netflix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ