Advertisementt

ఈ సినిమా ఇలా గమ్మత్తుగా పోతుందనుకోలేదు

Sat 07th Dec 2019 09:23 PM
srinivas reddy,bhagyanagara veedhullo gammattu,movie,result,box office  ఈ సినిమా ఇలా గమ్మత్తుగా పోతుందనుకోలేదు
Bhagyanagara Veedhullo Gammattu Result at Box Office ఈ సినిమా ఇలా గమ్మత్తుగా పోతుందనుకోలేదు
Advertisement
Ads by CJ

కమెడియన్ గా స్టార్ సినిమాల్లో పనిచేస్తూ బిజీగా గడిపే శ్రీనివాస రెడ్డి ఇప్పుడు డైరెక్టర్ గా కూడా సినిమా తీసేసాడు. కామెడీ చేస్తున్నా డైరెక్షన్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్న శ్రీనివాస రెడ్డికి ఆ కోరిక కూడా తీరింది. గీతాంజలి సినిమాలో మెయిన్ కేరెక్టర్ గా నటించిన శ్రీనివాస రెడ్డి ఆ సినిమాలో కథ పట్టుకుని డైరెక్టర్ అవ్వాలని తిరుగుతుంటాడు. అలాగే ఇప్పుడు ఓ కామెడీ కథతో భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అంటూ టైటిల్ పెట్టి మంచి రసగుల్లా లాంటి సినిమా అంటూ క్యాప్షన్ పెట్టాడు. మరి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మాత్రం... మంచి రసగుల్లా లాంటి సినిమా కాదు. నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ పడింది. అది శ్రీనివాసరెడ్డి కొంప ముంచింది.

ఫ్లైయింగ్ కలర్స్ బ్యానర్ పై 2 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకి కామెడీ ఫ్రెండ్స్ ఎవరు పారితోషకాలు కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకి పడిన డిజాస్టర్ టాక్ సినిమాని ఏ తీరానికి చేరుస్తుందో అంటున్నారు. ఎందుకంటే నిన్న శుక్రవారం భాగ్యనగర వీధుల్లో థియేటర్స్ అన్ని బోసిపోయాయి. ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న శ్రీనివాస రెడ్డి.. ఈ డైరెక్షన్ పిచ్చి వలన మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలో కామెడీ పాత్ర కాదనుకుని సినిమాని డైరెక్ట్ చేసాడు. ఆ సినిమా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డికి కన్నీరు మిగిల్చేలా ఉంది. మరి సంపాదించిన 2 కోట్లు ఈ సినిమాపై పెట్టి... ఇప్పుడు సినిమాకి ప్లాప్ టాక్ పడడంతో.. ఆయనకి మిగిలేది కన్నీరే కదా అంటున్నారు. 

Bhagyanagara Veedhullo Gammattu Result at Box Office:

Bhagyanagara Veedhullo Gammattu Movie Talk Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ