RX 100 తో ఆరడుగుల ఆజానుబాహుడు లాంటి ఓ హీరో టాలీవుడ్ కి దొరికాడు అనుకున్నారు. అర్జున్ రెడ్డితో విజయ్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడో... కార్తికేయ కూడా RX 100 తో స్టార్ హీరో అవుతాడని అన్నారు. RX 100 తర్వాత కాన్ఫిడెంట్ తో హిప్పీ సినిమా చేసి పప్పి అయ్యాడు కార్తికేయ. RX 100 క్రేజ్ తో హిప్పీ హిట్ అవుతుంది అనుకుంటే... చాచి కొట్టింది. ఆతర్వాత కార్తికేయ గుణ 369 అంటూ బోయపాటి శిష్యుడితో.. ఓ మాస్ మసాల సినిమా చేసాడు. ఆ సినిమా అన్నా హిట్ అనుకుంటే అది ఫట్ మంది. లో బడ్జెట్ లో తెరకెక్కించిన.. డిస్ట్రిబ్యూటర్స్ కి గుణ 369 దెబ్బేసింది. ఇక హీరోగా మార్కెట్ జీరో అవుతున్న వేళ శేఖర్ రెడ్డితో కలిసి 90 ఎంఎల్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో నటించాడు.
ఆ సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తికేయ ఓ అరుదైన వ్యాధితో పుట్టడం.. ఆ వ్యాధికి మందు రెండు పెగ్గులు మందు. ఆ పెగ్గులు కొట్టే దేవదాసు పాత్రలో కార్తికేయ నటన బావుంది. కానీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కథ, కథనం అన్ని సినిమాకి దెబ్బేసాయి. అనూప్ మ్యూజిక్ సో సో, కానీ నేపధ్య సంగీతం పర్వాలేదనిపించాడు. ఇక సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ ఏమి సినిమాకి హెల్ప్ కాలేదు. అక్కడక్కడా కామెడీ తప్పితే సినిమాలో చెప్పుకోవడానికేం లేదు. అందులోను మందు సీన్స్ పదే పదే రిపీట్ అవడం చిరాకు తెప్పించాయి. మరి రెండు సినిమాల డిజాస్టర్, నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గాను సక్సెస్ అవ్వక, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతోనూ కార్తికేయ గుమ్మకొండ ప్లాప్ అందుకున్నాడనే చెప్పాలి.