Advertisementt

గ్యాంగ్‌స్టర్‌గా మహేష్.. దర్శకుడెవరంటే..?

Sat 07th Dec 2019 08:26 PM
mahesh babu,vamsi paidipally,direction,gangster  గ్యాంగ్‌స్టర్‌గా మహేష్.. దర్శకుడెవరంటే..?
Mahesh 27th Film Details గ్యాంగ్‌స్టర్‌గా మహేష్.. దర్శకుడెవరంటే..?
Advertisement
Ads by CJ

మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఏ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇవ్వలేదు. సుకుమార్ తో తప్పిపోయిన మహేష్ సినిమా, సందీప్ వంగాతోనూ లేదు, ఇక కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ యవ్వారం మహేష్ దగ్గర తెగేలా లేదు. మరోపక్క మహర్షి చేసిన టైంలోనే వంశి పైడిపల్లికి మరో సినిమా మహేష్ కమిట్ అయ్యాడు కానీ.. అదెప్పుడో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ వంశి పైడిపల్లి మాత్రం మహేష్ కి కథ సిద్ధం చేస్తూ... మహేష్ వెనకాలే తిరుగుతున్నాడు.

తాజాగా మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమా వంశి పైడిపల్లితోనే అని సమాచారం. వంశి పైడిపల్లి కూడా మహేష్27 నాతోనే అంటున్నాడు. అది కూడా ఓ గ్యాంగ్‌స్టర్ కథతో వంశి పైడిపల్లి మహేష్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా  ప్రచారం జరుగుతుంది. వంశి పైడిపల్లి, మహేష్ ని గ్యాంగ్‌స్టర్‌గా మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చెయ్యాలని చూస్తున్నాడట. ఈ సినిమాని దిల్ రాజు సోలోగా నిర్మించనున్నాడట.  బిజినెస్‌మేన్ లో గ్యాంగ్‌స్టర్‌గా మహేష్ ఇరగదీసాడు. అయితే వంశి పైడిపల్లి మహేష్ ని గ్యాంగ్‌స్టర్‌గా ఎలా చూపించబోతున్నాడో అనే ఇంట్రెస్ట్ మహేష్ అభిమానుల్లో మొదలైంది. 

Mahesh 27th Film Details:

Again Mahesh Babu in Vamsi Paidipally Direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ