టాలీవుడ్‌కు చెందిన లేడీ యాంకర్స్ కొందరు.. ఎప్పుడో పద్ధతులు పక్కనెట్టేశారు.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా అక్షరాలా నిజం. ఎందుకంటే వారి ప్రవర్తన.. వాళ్లు చేసే చేష్టలు బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే పోటీ ప్రపంచంలో ఇలా చేస్తున్నారని అనుకున్నప్పటికీ.. బరి తెగించాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ అసలు పాయింట్. ఆ యాంకర్స్ గురించి ఇక కాస్త పక్కనెడితే ఇదిగో తాజాగా ఓ యాంకరమ్మ చేసిన పని చూడండి. అందరూ చేస్తున్నారుగా... నేనేమీ తక్కువ కాదని అనుకుందో లేకుంటే పాపులారిటీ కోసం ఇలా చేసిందో కానీ ప్రస్తుతం ఆమె అందరి నోళ్లలో నానుతోంది.!
‘పటాస్’ షోకు యాంకర్లుగా వ్యవహరించిన రవి, శ్రీముఖిలు తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇన్ని రోజులు ఎపిసోడ్‌లను లాక్కొని వచ్చారు. అయితే వారు ఎన్నెన్ని చేశారు..? వారిపైన ఎన్నెన్ని వివాదాలు నడిచాయ్..? అనేది ఇక్కడ అప్రస్తుతం. ఇప్పుడు ఆ షోకు ఆ ఇద్దరూ లేరు.. ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు వారి స్థానంలో జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి, వర్షిణి వచ్చారు. ఇప్పుడిప్పుడే షోకు వచ్చాం కదా అని.. ఏదో చేసి పాపులర్ అయిపోదామనుకున్నారో..? లేకుంటే రవి-శ్రీముఖి రేంజ్‌కు మనం కూడా వెళ్దాం అనుకున్నారో..? లేదా యాజమాన్యం ఒత్తిడితోనే కానీ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
షోలో భాగంగా ఎలాంటి సందర్భాల్లో మనం పొదుపు చేస్తాం..? అని అక్కడున్న స్టూడెంట్స్‌ను చంటి ప్రశ్నించాడు. అయితే ‘అమ్మన్’ అనే ఓ స్టూడెంట్ సమాధానం చెప్పేందుకు లేచి నిల్చోగా వెంటనే వర్షిణి కలుగజేసుకుని .. ‘హే వీడు ముద్దొస్తున్నాడు రా.. ఇక్కడికి రారా’ అంటూ స్టేజ్ పైకి పిలిచింది. మాట్లాడి పంపించుంటే బాగుండేమో కానీ.. ముద్దొస్తున్నాడు అనిందిగా ఆ కుర్రాడి బుగ్గలు కొరికినంతవరకూ వదల్లేదు. ఇదిగో పక్క ఫొటోలో చూడండి.. పళ్లు ఓ... అని తెరిచి మరీ కుర్రాడి బుగ్గపై కొరికింది. దీంతో అక్కడున్న మిగతా స్టూడెంట్స్ అందరూ ఇలా చేసిందేట్రా బాబూ అనుకుని షాకయ్యారు.. మళ్లీ రియలైజ్ అయ్యి షో కదా అని నవ్వి ఊరుకున్నారు.
ఈ యూట్యూబ్‌లో ఈ వీడియోకు పెద్ద ఎత్తున డిస్‌లైక్‌లు.. అంతకుమించి కామెంట్స్ వస్తున్నాయ్. మరోవైపు షో బూస్టింగ్ కోసం మరీ ఇంతలా బరితెగిస్తే ఎలా యాంకరమ్మా అంటూ కొందరు నెటిజన్లు.. క్రిటిక్స్ తిట్టిపోస్తున్నారు. ఎంత షో కోసం అయితే మాత్రం ఇలా కొరికితే ఎలా.. కంటెంట్ ఉంటే ఆటోమాటిక్‌గా జనాలు మీ షో చూస్తారు కానీ ఇలాంటి చిల్లరపనులు చేస్తే ఎలా చూస్తారు..? అని మరికొంతమంది వీక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ రేంజ్‌లో తిట్లు వస్తుంటే ఇకనైనా ఇలాంటి పనులు ఈ యాంకరమ్మ మానుకుంటుందో లేకుంటే.. అస్సలు తగ్గేది లేదంటూ మరింత స్పీడ్ పెంచుతుందో వేచి చూడాలి.