త్రివిక్రమ్ తో సినిమా అంటే ఆ హీరోకి కనీసం ఏడాది టైం అయినా పడుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ చాలా స్లోగా సినిమాలు తీస్తాడు అనేది అందరికి తెలుసు. అయితే అల్లు అర్జున్ తో మాత్రం అల వైకుంఠరములో ఆరు నెలల్లో పూర్తి చేసి చేతిలో పెడతానని మాటిచ్చాడు. మాటిచ్చినట్లే త్రివిక్రమ్ కూడా అల వైకుంఠపురములో షూటింగ్ ని పరిగెత్తించడం, అల్లు అర్జున్ ప్లానింగ్ తో ప్రమోషన్స్ లో జోరు చూపించడంతో, త్రివిక్రమ్ మారాడనుకున్నారు. ఇక ఇదంతా చూసిన అల్లు అర్జున్, సుకుమార్ తో సినిమా మొదలెట్టి డిసెంబర్ నుండి సెట్స్ మీదకెళ్లాలని భావించాడు.
అయితే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో షూటింగ్ చివరిలో కాస్త స్లోగా చిత్రీకరణ చేస్తున్నాడట. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి, అజ్ఞాతవాసిలా హడావిడీ వద్దు అంటున్నాడట. అయితే అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ సినిమా కోసం లుక్ మార్చాలని డిసైడ్ అయితే.. త్రివిక్రమ్ మాత్రం అల వైకుంఠపురములో షూటింగ్ లేట్ చెయ్యడంతో.. సుకుమార్ లుక్ విషయంలో అల్లు అర్జున్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడట. అల చిత్రీకరణ పూర్తయితే... సుకుమార్ సినిమా కోసం లుక్ మార్చి, గెడ్డం, హెయిర్ స్టయిల్ లు పెంచినా.. అల వైకుంఠపురములో ప్రమోషన్స్ కి ఇబ్బంది ఉండదని అల్లు అర్జున్ అనుకుంటుంటే.... త్రివిక్రమ్ మాత్రం అది కుదరనివ్వడం లేదట. అందుకే బన్నీ అల ప్రమోషన్స్ కూడా బ్రేకిద్దామని డిసైడ్ అవడంతో.. అల వైకుంఠపురములో టీం సైలెంట్ అయ్యారని ఫిలింనగర్ టాక్.