ప్రస్తుతం దేశమంతా దిశా ఘటనపై అట్టుడుకుతోంది. మహిళా సంఘాలే కాదు, స్కూల్ విద్యార్థులు సైతం రోడ్డెక్కి దిశా కేసు దోషులను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఇక సినీ హీరోలు, హీరోయిన్స్ సైతం దిశా ఘటన బాధాకరమంటూ దిశా దోషులకు త్వరగా శిక్ష పడాలని ట్వీట్స్ చేస్తున్నారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం దిశా కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాల్వ్ చెయ్యాలని హై కోర్టులో పిటిషన్ పెట్టడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి హై కోర్టు అనుమతినిచ్చింది. అయితే తాజాగా యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో దిశా ఘటనపైనా లైవ్ చాట్ లోకి వచ్చింది. ఆ లైవ్ చాట్ లో ఆడవాళ్ళని చాలా అసభ్యంగా మాట్లాడిన నెటిజెన్స్ ని అనసూయ కడిగి పారేసింది.
అనసూయ ఆడవాళ్ళకి భద్రతా ఎక్కడుంది, పెప్పర్ స్ప్రెస్ పట్టుకుని తిరుగుతున్నా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలకు మృగాళ్లు ఒడిగడుతున్నారు అంటూ స్పీచ్ ఇస్తూ... ఆభిమానులు వేసే ప్రశ్నలకు ఘాటుగా సమాధానమిచ్చింది. అసలు మీరు మగాళ్లేనా అంటూ ప్రశ్నించింది. ఓ ఆడపిల్ల రాత్రిపూట బయట తిరగడం నేరమా.. అసలు మనం ఉన్నది మనుషుల మధ్యేనా అంటూ విమర్శించింది. అయితే కొంతమంది పోకిరిగాళ్లు అనసూయతో మీలాంటివాళ్ళు తొడలవరకు బట్టలేసుకుని, స్లీవ్ లెస్ జాకెట్స్ వేసుకుని, గ్లామర్ ఒలకబోస్తుంటే... అలా(...) మాకు చెయ్యాలనిపిస్తుంది అని వల్గర్ గా కామెంట్ చెయ్యడం, మరొకరు ఆ అమ్మాయి కత్తిలా ఉంది గనకే వాళ్ళు (....)అలా చేసారు అంటూ కామెంట్ చేసేసరికి కోపం నషాళానికంటిన అనసూయ.. అసలు మీరు మగాళ్లని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి, మీ అమ్మ, చెల్లి విషయంలో మీరలా చేస్తారా? అమ్మాయిలను కనీసం మనుషుల్లా కూడా చూడని మీరు ఎందుకురా అంటూ కాస్త పరుష పదజాలంతో ఆ కామెంట్స్ పెట్టిన వారిని ఓ రేంజ్ లో ఆడేసుకుంది.