Advertisementt

‘90ML’ అంటున్నా.. క్రేజ్ రావడం లేదు!

Fri 06th Dec 2019 08:03 PM
90ml,miss match,bhagya nagara veedhullo gammathu,release,friday  ‘90ML’ అంటున్నా.. క్రేజ్ రావడం లేదు!
90ML, Miss Match, Bhagya Nagara Veedhullo Gammathu Ready to Release ‘90ML’ అంటున్నా.. క్రేజ్ రావడం లేదు!
Advertisement
Ads by CJ

ఈ శుక్రవారం విడుదలవుతున్న చెప్పుకోదగిన చిత్రాల్లో రెండో మూడో సినిమాలు ఉన్నాయి. అందులో RX 100 హీరో కార్తికేయ 90ML , ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుపుతున్న మిస్ మ్యాచ్ సినిమాలు. మిగతా సినిమాలు ఏమిటనేది ప్రేక్షకులకు తెలియదు. మథనం, భాగ్యనగర వీధుల్లో, ప్రెషర్ కుక్కర్ అంటూ ఏవేవో సినిమాలు వస్తున్నాయి కానీ.. అందులో కాస్త భాగ్యనగర వీధుల్లో మాత్రం ప్రేక్షకులకు తెలిసిన పేరు. మిగతావన్నీ వేస్టే. ఇక కార్తికేయకి RX 100 తో వచ్చిన ఫేమ్ కాస్తా... గుణ 369, గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చెయ్యడం, హిప్పీ సినిమాలతో ఎగిరిపోయింది.

అందుకే ఎంతగా ప్రమోట్ చేసిన 90 ML మీద క్రేజ్ రావడం లేదు. 90 ML అంటే యూత్ కి బాగా ఎక్కేస్తుంది అనుకుంటూ ఆ టైటిల్ పెట్టడంతో... మొన్న సెన్సార్ చేసుకోవాల్సింది కాస్తా... సెన్సార్ క్లియరెన్స్ చేయకపోవడంతో నిన్న సెన్సార్ క్లియరెన్స్ పొందింది. దానితో ఈ రోజు విడుదలవ్వాల్సిన 90 ML రేపు విడుదల కాబోతుంది. మరోపక్క మిస్ మ్యాచ్ హడావిడి మాములుగా లేదు. నిర్మాతలు ఆ సినిమాని తెగ ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఊపు తేవడానికి ట్రై చేస్తున్నారు కానీ.. ఆ సినిమాపై ప్రేక్షకులకు ఎక్కడం లేదనేది బుక్ మై షో చూస్తే తెలుస్తుంది. అటు కార్తికేయ 90 ML, భాగ్యనగర వీధుల్లో ఇలా అన్ని సినిమాలకు బుక్ మై షో లో టికెట్స్ తెగడం లేదు. అంటే ఈ వారం బాక్సాఫీసు పరమ బోరింగ్ గా ఉండబోతుందన్నమాట.  

90ML, Miss Match, Bhagya Nagara Veedhullo Gammathu Ready to Release:

No Craze to Karthikeya 90 ML Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ