Advertisementt

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన యంగ్ హీరో!

Thu 05th Dec 2019 09:10 PM
sundeep kishan,new business,saloon,amaravathi,young hero,sundeep  కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన యంగ్ హీరో!
Tollywood Young Hero Sundeep Starts New Business కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన యంగ్ హీరో!
Advertisement
Ads by CJ

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.

సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.

స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే... హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tollywood Young Hero Sundeep Starts New Business:

Sundeep Kishan Starts Saloon Business in Amaravati

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ